ఐశ్వర్య నగల చోరీ.. దొంగని కనిపెట్టిన పోలీసులు..!

Sat Apr 01 2023 12:00:01 GMT+0530 (India Standard Time)

Police Found Aishwarya Ornaments Thief

సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. 60 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు ఐశ్వర్య ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులు ఈ కేసు విచారించి ఇంటి పని మనిషి ఈశ్వరిని నిందితురాలిగా గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయాలు బయటపెట్టింది.కొన్నాళ్లుగా ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో పనిచేస్తున్న ఈశ్వరికి వారు ఇచ్చే జీతం సరిపోవట్లేదట. గొడ్డు చాకిరీ చేయించుకుని కేవలం 30 వేల జీతం ఇస్తున్నారని.. అందుకే ఐశ్వర్య ఇంట్లో దొంగతనం చేసినట్టు చెప్పుకొచ్చింది ఈశ్వరి.

ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా చిన్న చిన్న దొంగతనాలు చేశానని కానీ ఎప్పుడూ పట్టుబడలేదని కానీ ఈసారి బంగారం దొంగతనం చేశానని విచారణలో ఒప్పుకుంది ఈశ్వరి. గొడ్డు చాకిరి చేయించుకుని 30 వేలు ఇస్తున్నారని.

ఆ డబ్బుతో ఒక ఫ్యామిలీ ఎలా నడిపించాలని అందుకే దొంగతనం చేశానని తెలిపింది. అయితే ఈశ్వరి దగ్గర ఐశ్వర్య నగలతో పాటుగా ఇంకొన్ని నగలు పోలీసులు గుర్తించారు. ఈశ్వరి కేవలం ఐశ్వర్య ఇంట్లోనే కాదు రజినీకాంత్ ధనుష్ ఇల్లలో కూడా పనిచేస్తుందట.

వారి ఇల్లలో కూడా ఈశ్వరి చేతివాటం చూపించిందని తెలుస్తుంది. సెలబ్రిటీ ఇల్లలో ఇంటి పని చేసే వారికి చాలా వరకు ఫ్రీడం ఇచ్చేస్తారు. కానీ వారు కొందరు దాన్ని మిస్ యూజ్ చేసుకుంటున్నారు.

ఎప్పటి నుంచో ఐశ్వర్య ఇంట్లో ఈశ్వరి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వచ్చింది. కానీ నగలు మిస్ అవడంతో వ్యవహారం బయటపడింది. ఐశ్వర్య కూడా తన పని మనిషి మీద డౌట్ ఎక్స్ ప్రెస్ చేయగా ఆ విధంగా విచారణ చేపట్టిన పోలీసులు ఫైనల్ గా ఆమెనే దొంగతనం చేసిందని విషయం రాబట్టారు.    


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.