`పోకిరి` ఇలాంటి రికార్డును ఊహించనే లేదు!

Wed Aug 10 2022 22:30:23 GMT+0530 (IST)

Pokiri did not expect such a record

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును ఆయన అభిమానులు మునుపెన్నడూ లేని విధంగా జరుపుకున్నారు. తమ ఫేవరెట్ ఆల్-టైమ్ బ్లాక్ బస్టర్ `పోకిరి` 370కి పైగా ప్రత్యేక షోలు నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించగా.. అభిమానులు ప్రతిచోటా స్పెషల్ షోలను ఆస్వాదించారు. కలెక్షన్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. పోకిరి స్పెషల్ షోల కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.ఉత్తరాంధ్ర - రూ. 24.9 లక్షలు .. తూర్పుగోదావరి - రూ. 11.8లక్షలు.. ..కృష్ణ - రూ. 10.3 లక్షలు .. గుంటూరు - రూ. 13.1 లక్షలు వసూలు చేసింది. రీ-రిలీజ్ అయిన సినిమాకు ఇది కొత్త రికార్డు. ఈ సినిమాలో మహేష్ సరసన ఇలియానా కథానాయిక కాగా ప్రకాష్ రాజ్- బ్రహ్మానందం తదితరులు నటించారు. పూరి దర్శకత్వం వహించగా.. మణిశర్మ సంగీతం అందించారు.

పవన్ రికార్డులు ఎప్పుడు?

`పోకిరి` స్పెషల్ షోలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారడంతో ప్రస్తుతం పవన్ అభిమానుల్లోనూ దీనిపై చర్చ సాగుతోంది.  జంట తెలుగు రాష్ట్రాలు  సహా అమెరికా అంతటా `పోకిరి` కోసం దాదాపు 400 స్పెషల్ షోలు ప్రదర్శించారు. ఇదే తరహాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తమ ఫేవరెట్ హీరో మూవీని ఆడించాలని భావిస్తున్నారు. పోకిరి స్పెషల్ షోల ఆర్కెస్ట్రేషన్ లో మహేష్ బాబు టీమ్ పాల్గొనడంతో ఈ షోలన్నీ చివరి నిమిషంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రదర్శించారు.

దీనిని నిర్ధారించుకోవడానికి  ఫ్యాన్స్ పంపిణీదారులతో కోఆర్డినేట్ చేసుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియను మహేష్ టీమ్ నేర్పుగా నిర్వహించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు జల్సా స్పెషల్ షోలతో అలాంటిదే పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే వారు ఈ స్థాయిలో ఏదైనా చేయాలంటే జల్సా నిర్మాత అల్లు అరవింద్ సహాయం చాలా అవసరం. జల్సా గీతా ఆర్ట్స్ లో తెరకెక్కింది. అందుకే అల్లు అరవింద్ సహాయం కూడా అవసరం. కానీ ఇది జరుగుతుందా? అంటే.. అరవింద్ పవన్ అభిమానుల మాటను కాదనడని కూడా భావిస్తున్నారు.

పోకిరి కమర్షియల్ యాక్షన్ సినిమా కాగా జల్సా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జానర్ కాబట్టి ఈ మూవీ రీరిలీజ్ లో ఆడేందుకు ఆస్కారం ఉందని అంటున్నారు. ఎలాగైనా పవన్ కళ్యాణ్ అభిమానులు పోకిరి రికార్డ్ ను బీట్ చేయాలని ఉత్సాహంగా ఉన్నారు. కానీ 400 షోల రీ-రిలీజ్ రికార్డును బద్దలు కొట్టడానికి వారికి ఏదైనా మ్యాజిక్ జరగాలి. దానికోసం బిగ్ హ్యాండ్ సహాయం అవసరమని విశ్లేషిస్తున్నారు.