దయచేసి పాత వీడియోలు ఇప్పుడు పెట్టవద్దు : బండ్ల

Sun Nov 22 2020 18:46:27 GMT+0530 (IST)

Please do not put old videos now: Bandla

తెలంగాణలో 2018 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆయన ఆ ఎన్నికల సమయంలో ఒక పెద్ద జోకర్ గా మారాడు అనేది కొందరి విమర్శ. కాంగ్రెస్ లో జాయిన్ అయిన బండ్ల గణేష్ ఆ పార్టీ అధికారం దక్కించుకుంటుందని.. టీఆర్‌ఎస్ పార్టీ కి చుక్కలు చూపిస్తామంటూ చాలా బలంగా గట్టిగా మాట్లాడాడు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్లగణేష్ ఏకంగా కాంగ్రెస్ ఓడిపోతే గుండు గీకించుకుంటాను అంటూ మాట్లాడి రచ్చ రచ్చ చేశాడు.ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. బండ్ల బాబు మాటలు నీటి మూటలు అయ్యాయి. దాంతో అప్పటి నుండి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటించాడు. ప్రస్తుతం తాను ఏ పార్టీకి దగ్గరగా లేను అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో ఆయన పదే పదే కేసీఆర్ మరియు కేటీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బండ్ల పాత వీడియోలు కొందరు సోషల్ మీడియాలో మళ్లీ షేర్ చేస్తున్నారు. దాంతో వారికి బండ్ల గణేష్ విజ్ఞప్తి చేశాడు. ''నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరం. దయచేసి గతంలో  మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన మీ బండ్ల గణేష్''  .. అంటూ తన వీడియోల విషయంలో క్లారిటీ ఇచ్చాడు. మరి మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే బండ్ల గణేష్ వీడియోలను రీషేర్ చేయవద్దంటే నెటిజన్స్ ఊరుకుంటారా చూడాలి.