బాలీవుడ్ లో శర్మా సిస్టర్స్ క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది. ఈ భామలు వరుస ఫోటోషూట్లతో కవ్విస్తూనే.. నిజ జీవిత కథలతో..``షైనింగ్ విత్ ది శర్మాస్`` షోలో వేడెక్కిస్తూ సంచలనంగా మారుతున్నారు. తాజా ఫోటోషూట్ లో అక్కా చెల్లెళ్ల హాటెస్ట్ అవతార్ అగ్గి రాజేసింది. టాప్ యాంగిల్ నుంచి కవర్ చేసిన ఈ హాటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది.
లుక్ వైజ్ వర్ణిస్తే.. నేహా శర్మ -ఐషా శర్మ వైట్ టాప్స్ లో కనిపించారు. హాటెస్ట్ ఫోజులతో తమ అభిమానులను టీజ్ చేశారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అధికారిక ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేయగా వైరల్ గా మారాయి.. ఇటీవలి కాలంలో ఫోటోషూట్ల మాయాజాలంతోనే నేహా శర్మ -ఐషా శర్మ సోషల్ మీడియాలో బాగా పాపులరయ్యారు.
సంవత్సరాలుగా తమను ఆరాధించే అభిమానులను సంపాదించుకున్నారు. ఈ ప్లాట్ ఫారమ్ లలో వారి షార్ట్ ఫారమ్ కంటెంట్ కూడా అభిమానుల నుండి మంచి స్పందనను అందుకుంటోంది. షైనింగ్ విత్ ది శర్మాస్ పెద్ద సక్సెసైంది. ఈ సరికొత్త షో ప్రముఖ అమెరికన్ రియాలిటీ షో `కీపింగ్ అప్ విత్ ది కర్దాషియాన్స్` తరహా అప్పీల్ తో ఆకట్టుకుంటోంది. సిస్టర్స్ దూకుడు ముందు ఇతర భామలు రేసులో వెనక్కి వెళ్లాల్సిందే.
ఐషాశర్మ తన ఇన్ స్టా మాధ్యమంలో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసింది.
25.01.2023 : ఐషా మ్యూజింగ్స్ అంటూ ఆనందంగా తన సోదరితో కలిసి సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్లిపోయింది. నేను పుట్టినరోజులను నమ్ముతాను.. రోజంతా.. ప్రతిరోజూ.. అన్ని విధాలుగా నన్ను నేను ప్రేమిస్తుంటాను.
ప్రేమకు నేను కృతజ్ఞురాలిని.. నేను చెప్పగలను. ఈరోజు సెలవుదినంలా అనిపిస్తోంది. కోరికలు చెలరేగడంలో ఏదో అద్భుతం. నేను ధనవంతుల కంటే ఆనందాన్ని ఎక్కువగా నమ్ముతాను.
11:11 పీఎం దొంగిలించిన ముద్దులు.. నా భావాలు నిజం.. నా కవిత్వంలో వందకు పైగా అవాంతరాలు ఉన్నాయి! అంటూ చాలా ఫన్ నోట్ తో ఐషా తనలోని కవిని బరిలోకి దించింది. ఈ కవిత్వానికి తన సోదరి నేహా శర్మ తెగ మురిసిపోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.