పిక్ టాక్ : తల్లి కూతుర్లు కలిసి

Thu Jun 10 2021 12:00:01 GMT+0530 (IST)

Pic Talk?: Mother daughters together

ఈమద్య కాలంలో తండ్రి కొడుకులు.. తల్లి కూతుర్లు కలిసి స్క్రీన్ పై కనిపించడం సర్వ సాదారణ విషయం. బాలీవుడ్ టాలీవుడ్ ఇలా అన్ని వుడ్స్ కు చెందిన వారు ఇలా స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సారా అలీ ఖాన్ తన తల్లి అమృత సింగ్ తో కలిసి యాడ్ షూట్ లో పాల్గొంది. అమృత సింగ్ కూడా ఒకప్పుడు నటి. ఎన్నో సినిమాల్లో నటించిన 1980 ల్లో మంచి విజయాలను దక్కించుకున్నాయి. అలాంటి అమృత సింగ్ చాలా కాలం పాటు వెండి తెరకు దూరం అయ్యింది. అయితే ఈమద్య కాలంలో బుల్లి తెరపై ఈమె సందడి చేస్తోంది.తన కూతురు సారా అలీ ఖాన్ తో సోషల్ మీడియాలో హంగామా చేస్తూ ఉండే అమృత సింగ్ ఈసారి కూతురు తో కలిసి ఒకటి రెండు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. ఇటీవల ఇలా ఫొటోలకు ఫోజు ఇచ్చింది. తల్లి కూతుర్ల మద్య ఉండే ఆప్యాయత కు చిహ్నం అన్నట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ స్టార్స్ ఇలా తల్లులతో లేదా తండ్రులతో కలిసి ఫొటోలకు ఫోజు ఇచ్చిన సమయంలో అవి వైరల్ అవుతూ ఉంటాయి. ఈసారి సారా అలీ ఖాన్ మరియు అమృత సింగ్ ల ఫొటో కూడా నెట్టింట సందడి చేస్తోంది.

సైఫ్ అలీ ఖాన్ తో విడిపోయిన తర్వాత సినిమా లకు కూడా దూరంగా ఉంటుంది అమృత సింగ్. అయితే తన కూతురు సారా అలీ ఖాన్ ను హీరోయిన్ గా చేసింది. ఇటీవల హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సారా మెల్ల మెల్లగా బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. వారసురాలిని అనిపించుకోకుండా కష్టపడి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పలు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సారా అలీ ఖాన్ ఈసారి తల్లితో కలిసి ఇలా కాస్మోటిక్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది.