Begin typing your search above and press return to search.

విట‌మిన్ -C మోతాదు మించుతోందేమో మ్యాడ‌మ్?

By:  Tupaki Desk   |   3 March 2021 5:30 PM GMT
విట‌మిన్ -C మోతాదు మించుతోందేమో మ్యాడ‌మ్?
X
న‌ట‌వార‌సురాలు సారా అలీఖాన్ ఈ కొత్త స్టంట్ చూశారుగా..? విట‌మిన్ -సీ కావాలా? అంటూ తెగ ఊరించేస్తోంది. దానికోసం ఏం చేస్తోందో చూశారు క‌దా? అలా బికినీ బీచ్ లో షికార్ చేస్తూ విట‌మిన్ సీ డైలీ డోస్ పంపిణీ చేస్తాన‌ని అంటోంది. ప్ర‌స్తుతం మాల్దీవుల విహారంలో ఉన్న సారా అలా హ‌ద్దులు చెరిపేసి చెల‌రేగిపోయింది.

విట‌మిన్ సీ పంపిణీ చేయ‌డం అంటే ఏదో మాట వ‌ర‌స‌కు అనేయ‌లేదు. ఇదిగో ఇలా ఆరంజ్ బికినీలో దుమారం రేపింది. బికినీలో యంగ్ బ్యూటీ వేడెక్కించే అందాలు అగ్గి రాజేస్తున్నాయి. `విటమిన్ సీ` మోతాదు మించుతోందేమో మ్యాడ‌మ్! అంటూ బోయ్స్ ఒక‌టే క‌వ్వింత‌గా విసుర్లు విసిరేస్తున్నారు.

నీలివ‌ర్ణం స‌ముద్రుడి చెంత .. రోజువారీ మోతాదు విటమిన్ సి ని ప్రిపేర్ చేస్తున్నాన‌ని ఊరించింది. త‌న పోస్ట్ కు #vitaminc #vitaminsea అనే హ్యాష్ ‌ట్యాగ్ ‌లను జోడించింది. మాల్దీవులలో త‌ల్లి అమృత సింగ్ .. సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్లతో కలిసి ఈ సంవత్సరం ప్రారంభంలో విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఎంతో సరదాగా గడిపిన సారా మ‌ళ్లీ మాల్దీవుల‌కు వెళ్లింది ఈ స్పెష‌ల్ షూట్ కోసం.

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన కేదార్ నాథ్ చిత్రంతో సారా అలీ ఖాన్ 2018 సంవత్సరంలో బాలీవుడ్ లో కి అడుగు పెట్టారు. కార్తీక్ ఆర్యన్ తో కలిసి లవ్ ఆజ్ కల్ లో .. ర‌ణ‌వీర్ స‌ర‌స‌న‌ సింబా వంటి చిత్రాల్లో సారా నటించింది. చివరిసారిగా వరుణ్ ధావన్ కూలీ నంబర్ 1 రీమేక్ ‌లో సారా కనిపించింది. అక్షయ్ కుమార్ - ధనుష్ ల‌తో క‌లిసి‌ అట్రాంగి రే చిత్రంలోనూ సారా నాయిక‌గా న‌టిస్తోంది.సారా బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్- అమృత సింగ్ ల కుమార్తె. ఆమె తండ్రి సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు నటి కరీనా కపూర్ ను వివాహం చేసుకున్నారు. సైఫ్ - కరీనా తమ రెండవ బిడ్డకు స్వాగతం పలికారు. 4 ఏళ్ల తైమూర్ ‌కు వీరు తల్లిదండ్రులు.