Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః సూర్యోదయంలా వెలిగి పోతోంది

By:  Tupaki Desk   |   24 Jan 2021 12:30 PM GMT
ఫొటోటాక్‌ః సూర్యోదయంలా వెలిగి పోతోంది
X
తెలుగు ప్రేక్షకులకు భరత్‌ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాలతో పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా దూసుకు పోతుంది. తెలుగులో చేసిన రెండు సినిమాల్లో ఒకటి సక్సెస్‌ కాగా మరోటి ప్లాప్‌ అయ్యింది. అయినా కూడా ఈ అమ్మడికి టాలీవుడ్‌ లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. స్టార్‌ హీరోయిన్‌ ల స్థాయి పారితోషికం ఇచ్చి ఈమెను నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఈమె మాత్రం బాలీవుడ్‌ లోనే ఫిక్స్ అయ్యింది. కేవలం హీరోయిన్‌ గానే కాకుండా వెబ్‌ సిరీస్ లతో కూడా మెప్పిస్తుంది. కియారా ఏ కాస్ట్యూమ్స్ లో అయినా అదరహో అన్నట్లుగా ఉంటుంది అనే టాక్‌ ఉంది.

ఈ ఫొటోను ఆకాంక్ష రాజన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆమె ఈ ఫొటో పై సూర్యోదయం సమయంలో కియారాతో చిట్‌ చాట్‌ అన్నట్లుగా కామెంట్‌ పెట్టింది. సూర్యోదయం సమయంలో సూర్యుడు ఎంత కూల్‌ గా అహ్లాదకరంగా ఉంటాడో అలాగే ఈ ఫొటోలో కియారా అద్వానీ కూడా అలా సింపుల్ అండ్‌ స్వీట్ గా ఉందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‌ లో సిద్దార్థ మల్హోత్ర తో ఒక సినిమాలో నటిస్తుంది. ఇంకా పలు సినిమాలు కూడా ఈ అమ్మడి ఖాతాలో ఉన్నాయి. స్కిన్‌ షో చేసినా ఇలా సింపుల్‌ గా కనిపించినా కూడా కియారా ఫొటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉన్నాయి.