ఫోటోటాక్ : సెగలు పుట్టిస్తున్న మహేష్ బ్యూటీ

Fri May 13 2022 15:14:24 GMT+0530 (IST)

PhotoTalk: Kiara Advani Beauty

సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఆ సినిమా వెంటనే రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే బాలీవుడ్ లో ఒక్కసారిగా ఆఫర్లు వెళ్లువెత్తాయి. దాంతో బాలీవుడ్ కే ఈ అమ్మడు పరిమితం అయ్యి అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది.ఈ అమ్మడికి తెలుగు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ అయిన కబీర్ సింగ్ బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ను తెచ్చి పెట్టింది. బాలీవుడ్ లో ఈ అమ్మడు ప్రస్తుతం స్టార్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు మోస్ట్ వాంటెడ్ గా మారింది అనడంలో సందేహం లేదు. తెలుగు లో ప్రస్తుతం ఆర్ 15 లో రామ్ చరణ్ కు జోడీగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను ఈమె చేస్తున్న విషయం తెల్సిందే.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా కవర్ పేజీలకు ఫోజ్ లు ఈ అమ్మడు ఇవ్వకుండా ఉండదు. రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటో షూట్ తో తన సోషల్ మీడియా ఫాలోవర్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటుంది. కరోనా సమయంలో సినిమాలు లేకున్నా కూడా హాట్ ఫోటో షూట్ లను షేర్ చేయడం వల్ల భారీ ఎత్తున అభిమానులను అలరించింది.

తాజాగా ఈ గ్రీన్ లుక్ లో కనిపించి సెగలు పుట్టిస్తోంది. ఈ అమ్మడి క్లీ వేజ్ షో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాదారణంగా కియారా అద్వానీ ఏం షేర్ చేసినా కూడా లక్షల్లో లైక్స్ మరియు వేలల్లో కామెంట్స్ ఉంటాయి. అలాగే ఈ ఫోటో కూడా భారీగా లైక్స్ తో దూసుకు పోతుంది.

కియారా అద్వానీ తెలుగు లో చేస్తున్న రామ్ చరణ్ మూవీ తర్వాత మరో సినిమాను కూడా కమిట్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ తో సందీప్ వంగ తెరకెక్కించబోతున్న సినిమా స్పిరిట్ సినిమాలో ఈమెను హీరోయిన్ గా ప్లాన్ చేస్తున్నాడు.

కబీర్ సింగ్ తో తనకు స్టార్ స్టేటస్ ను తెచ్చి పెట్టిన సందీప్ అడిగితే ఖచ్చితంగా కియారా అద్వానీ కాదు అనక పోవచ్చు. కనుక స్పిరిట్ లో ఈమె దాదాపుగా కన్ఫర్మ్ అంటూ వార్తలు వస్తున్నాయి.