Begin typing your search above and press return to search.

ఇల్లీ బేబీ ఎల్లో బికినీ మ‌స్త్ కిరాక్

By:  Tupaki Desk   |   1 July 2022 2:30 AM GMT
ఇల్లీ బేబీ ఎల్లో బికినీ మ‌స్త్ కిరాక్
X
బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ అంటే ముందు వ‌రుస‌లో ఉంటుంది ఇలియానా. గోవా అయినా.. మాల్దీవులు అయినా బీచ్ సెల‌బ్రేష‌న్ డెస్టినేష‌న్స ని అమితంగా ఇష్ట‌ప‌డే ఇలియానా ఇంత‌కుముందు ఫిజీ దీవుల్లోనూ బికినీ మంట‌లు పెట్టింది. ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో క‌లిసి బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ ని ఆస్వాధించేందుకు ఇలియానా ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. కానీ ఆండ్రూతో బ్రేక‌ప్ అయ్యాక ఆ బాధ నుంచి కోలుకునేందుకు చాలా స‌మ‌యం ప‌ట్టింది.

ఇటీవ‌ల మ‌ళ్లీ వ‌రుస‌ బికినీ ల‌తో యూత్ కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తోంది. ఇంత‌కుముందు రెడ్ హాట్ బికినీల‌ను షేర్ చేసిన ఇలియానా ఈసారి ప‌సుపు రంగు బికినీని షేర్ చేసింది.

తాజా ఫోటోగ్రాఫ్ లో మేక‌ప్ లెస్ లుక్ లో ఎంతో నేచుర‌ల్ గా క‌నిపిస్తున్న ఇలియానా త‌న హాట్ టోన్డ్ బాడీని ఎలివేట్ చేసింది. ప్ర‌స్తుతం బికినీ బీచ్ విహారంలో బిజీగా ఉన్న ఈ బ్యూటీ మునుముందు మ‌రింత‌గా స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

కొత్త బోయ్ ఫ్రెండ్ అత‌డే

ఆస్ట్రేలియ‌న్ ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్ తో బ్రేక‌ప్ అయ్యాక ఇలియానా మ‌రో కొత్త స్నేహాన్ని క‌నుగొంది. అభిమానుల‌తో 'ఆస్క్ మీ ఎనీథింగ్' చిట్ చాట్ సెష‌న్ లో కొత్త‌ బోయ్ ఫ్రెండ్ ఎవ‌రు? న‌చ్చిన‌వాడు ఎవ‌రు? అనే రెండు ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి.

వాటికి ఇల్లీ వెంట‌నే ఆన్స‌ర్ కూడా ఇచ్చేసింది. అత‌డి పేరు చార్లీ.. నా కొత్త ఫ్రెండ్! అంటూ ప‌రిచ‌యం చేసింది. ఇంత‌కీ చార్లీ ఎవ‌రు? అంటే.. తన పెట్ డాగ్. ఆ క్యూట్ ప‌ప్పీ‌ ఫోటోను ఇటీవ‌ల‌ షేర్ చేసింది. గోవా బ్యూటీలో ఫ‌న్ ఎలిమెంట్ అభిమానుల‌కు న‌చ్చేసింది.

ఇలియానా కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే.. దేవుడు చేసిన మ‌నుషులు- అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని లాంటి డిజాస్ట‌ర్ సినిమాల్లో న‌టించిన ఇలియానాకు మ‌ళ్లీ టాలీవుడ్ లో ఆఫ‌ర్ లేదు. ది బిగ్ బుల్ త‌ర్వాతా స‌రైన ఆఫ‌ర్లు లేవు. కెరీర్ ప‌రంగా బాలీవుడ్ లోనూ వెన‌క‌బ‌డింది.