ఫోటోటాక్ : జిమ్ కి వెళ్లేప్పుడు కూడా ఇంత అందంగానా..!

Sat Oct 01 2022 21:00:02 GMT+0530 (India Standard Time)

Photo Talk: Is it so beautiful even when you go to the gym?

2011 సంవత్సరంలో లేడీస్ వర్సెస్ రాఖీ భాయ్ సినిమాతో హీరోయిన్ గా హిందీ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం దాటింది. పలు సినిమాల్లో నటించి మంచి విజయాలను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేయగలిగింది.అందాల విందు విషయంలో ఇతర బాలీవుడ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గలేదు. తన సీనియర్ హీరోయిన్స్ కు పోటీ అన్నట్లుగా అంతకు మించి అన్నట్లుగా ఉన్న పాత్రలు.. హాట్ ఫోటో షూట్స్ ఎన్నో చేసింది. ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అందాల విందు చేస్తూ ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ఉంది.

ఇన్ స్టా లో దాదాపుగా నాలుగు పదుల మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు వారిని సంతృప్తి పర్చేందుకు సాధ్యం అయినంత వరకు రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జిమ్ కు రెడీ అయినట్లుగా కనిపిస్తున్న ఈ అమ్మడిని చూసి కొందరు మరీ ఇంతగా రెడీ అయ్యి వెళ్లడం ఏంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

టైట్ స్పోర్ట్స్ బ్రా మరియు టైట్ షార్ట్ లో అమ్మడి అందాల విందు కు ఎంతటి వాళ్లైనా కూడా ఫిదా అవ్వాల్సిందే అనడంలో సందేహం లేదు. 33 ఏళ్ల పరిణితో చోప్రా ఏడాదికి రెండు మూడు సినిమాల చొప్పున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

కేవలం రొమాంటిక్ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా ఈమె మోస్ట్ వాంటెడ్ గా ఉంది అంటే కారణం ఆమె ఫిజిక్ అంటూ అభిమానులు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. హీరోల  స్థాయిలో పరిణీతి వర్కౌట్స్ చేసిన వీడియోలు మనం గతంలో చాలానే చూశాం. అందుకే ఈ టైట్ ఫిట్ బాడీ.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.