ఫొటో టాక్: జాన్వీ పాప.. ఇంతలా రెచ్చిపోయినా..

Sat Jun 25 2022 17:00:01 GMT+0530 (India Standard Time)

Photo Talk : Bollywood Glamours Beauty Janhvi Kapoor

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందం విషయంలో రోజురోజుకు కుర్రాళ్ళను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా ఈజీగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ బ్యూటీగా క్రేజ్ అందుకునేందుకు ఆమె గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. రెగ్యులర్ గా ఫ్యాషన్ డ్రెస్సుల్లో సరికొత్తగా అందాలను అరబోయడంలో కూడా కొత్తగా ఆలోచిస్తుంది.ఇక రీసెంట్ గా జాన్వీ కపూర్ తెల్లని బ్లేజర్ స్కట్ కాంబినేషన్ లో ఎద అందాలను లెగ్స్ అందాలను ఒకేసారి హైలెట్ చేస్తూ షాక్ ఇచ్చేసింది. గతంలో బికినిలో కూడా కనిపించిన జాన్వీ ఈసారి అంతకంటే ఎక్కువ కిక్కిచ్చిందని ఆమె ఫాలోవర్స్ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.

జాన్వీ అదృష్టం ఏమిటో గాని ఒక పట్టాన లక్కు ఆమె పక్కన ఉండడం లేదు. అనవసరంగా ఆశతో అగ్ర హీరోయిన్ అనే ఉహలో బ్రతికేస్తూ తొలి దశలోనే మార్కెట్ లేకపోయినా హై బడ్జెట్ లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది.

నటిగా పరవాలేదు అనిపించింది గాని ఆమె అవకాశాలు అందుకోవడంతో మాత్రం పెద్దగా సక్సెస్ అవ్వడం లేదు. తన స్థాయి కంటే ఎక్కువగా ఊహించుకొని తండ్రి మాటలు విని కూడా కొన్ని మంచి అవకాశాలను ఆమె మిస్ చేసుకుంది. టాలీవుడ్ నుంచి ఈ బ్యూటీ కొన్ని మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి.

కానీ టాలీవుడ్ అంటే కాస్త చిన్న చూపుతో పక్కన పెట్టేసిందని ఇండస్ట్రీలో అప్పట్లో ఒక టాక్ అయితే వినిపించింది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల రాకతో అమ్మడి మనసు మళ్ళీ తెలుగు హీరోలపై పడింది.

దీంతో తరచుగా ఇంటర్వ్యూలలో ఇక్కడి స్టార్స్ గురించి దర్శకుల గురించి కాస్త ఎక్కువగా మాట్లాడుతోంది. ఇక బాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు ఏమి రావడం లేదు. ఎదో కరణ్ జోహార్  కారణంగా తండ్రి బోణి కపూర్ సపోర్ట్ తో ముందుకు సాగుతోంది గాని సొంతంగా ఆమె ఇంతవరకు సరైన అవకాశాలు అయితే అందుకోలేదు. మరి ఈ గ్లామర్ ప్రజెంటేషన్ తో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.