ఫోటో స్టోరీ: బ్లాక్ స్కర్ట్ లో కియారా అందాలు.. చూస్తే కళ్లు తిప్పుకోలేరు..!

Mon Oct 19 2020 17:20:24 GMT+0530 (IST)

Photo Story: Kiara is a beauty in a black skirt .. you can't take your eyes off her ..!

కియారా అద్వానీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో వెంటనే రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. 'వినయ విధేయ రామ' సినిమా పరాజయం పాలైనా కియారా అంద చందాలతో ప్రేక్షకులను అలరించింది. కాకపోతే రెండో సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితేనేం బాలీవుడ్ లో దూసుకుపోతోంది. 'ఫగ్లీ' సినిమాతో తెరంగేట్రం చేసిన కియారాకి 'ఎం.ఎస్.దోని ది అన్ టోల్డ్ కహాని' బ్రేక్ ఇచ్చింది. 'లస్ట్ స్టోరీస్' సిరీస్ తో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'కబీర్ సింగ్' సక్సెస్ తో బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.ఈ నేపథ్యంలో అమ్మడు కనిపిస్తే చాలు.. ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెబుతుంటారు. ఇప్పుడు తాజాగా హాట్ లుక్స్ తో కుర్రాళ్ల మతులు పోగెట్టే స్టిల్ ఇచ్చింది కియారా. ఆమె నటించిన 'లక్ష్మీ బాంబ్' ప్రమోషన్స్ లో భాగంగా బ్లాక్ స్కర్ట్ లో కనిపించి అందరినీ ఆకర్షించింది. ఈ ఫొటోలో ట్రెండీ అవుట్ ఫిట్స్ తో అందంగా కనిపించడంతో పాటు హాట్ గా కూడా ఉంది కియారా. 'కాంచన' రీమేక్ గా రాఘవ లారెన్స్ తెరకెక్కించిన 'లక్ష్మీ బాంబ్' సినిమాలో అక్షయ్ కుమార్ కి జోడిగా నటించింది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల అవుతున్న కారణంగా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. దీంతో పాటు కార్తీక్ ఆర్యన్ తో కలిసి 'భూల్ భూలైయా 2' అనే హారర్ కామెడీ ఎంటర్టైనర్ లో కూడా నటిస్తోంది. అలానే 'ఇందూ కి జవానీ' మరియు అక్షయ్ కుమార్ - సిధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించనున్న 'షెర్షా' సినిమాలను కూడా ఈ భామ లైన్లో పెట్టింది.