Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: 1990 మేడమ్.. సార్ మేడ..మ్ అంతే!

By:  Tupaki Desk   |   15 Feb 2020 11:40 AM GMT
ఫోటో స్టోరీ: 1990 మేడమ్.. సార్ మేడ..మ్ అంతే!
X
సీనియర్ స్టార్ హీరోలు అరవైలు వచ్చినా హీరోలుగా చెలామణీ అవుతూ ఉంటారు. కుర్రవేషాలు వేస్తూ ఉంటారు. జనాలు కూడా అది సహజమేనని సరి పెట్టుకుంటూ ఉంటారు. అదే కనుక మలైకా అరోరా లాంటి సీనియర్ బ్యూటీ ఒక కుర్ర హీరోతో అచ్చికబుచ్చికలాడితే మాత్రం కొంప కొల్లేరయినట్టు ఆంగ్ల భాషలో శాపనార్థాలు పెడతారు. అంటే వయసు కొంచెం మీద పడితే చాలు సీనియర్ హీరోయిన్లు హుందాగా ఉండాలని ఫిక్స్ అయి పోతారు. ఈ జనాలు అనుకున్నట్టుగా అందరూ హుందాగా ఉండలేరు కానీ కొందరు మాత్రం సరిగ్గా అలానే ఉంటూ వయసు మీద పడినా తమ అందంతో మాయలో పడేస్తుంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ సరిగ్గా అలాంటి మేడమ్.

ఈ జెనరేషన్ ప్రేక్షకుల్లో మాథురి పేరు ఎక్కువ మందికి తెలియక పోవచ్చు కానీ 80..90 లలో బ్లాక్ బస్టర్లతో మాధురి బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది. 'హమ్ ఆప్కే హై కౌన్' లాంటి 'సాజన్' లాంటి సూపర్ డూపర్ హిట్స్ ఆమె లిస్టులో బొచ్చెడు ఉన్నాయి. ఇప్పటికీ మాధురి బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. టీవీ కార్యక్రమలలో పాల్గొంటూ ఉంటారు. మాధురి సోషల్ మీడియా మీడియా లో యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటారు.

రీసెంట్ గా మాధురి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు "గన్స్ ఆఫ్ బెనారస్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రిక్కూ గారికి కంగ్రాట్స్. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలో మాథురి ఓ అందమైన డిజైన్ ఉన్న చీర ధరించి.. ఆ చీరకు తగ్గట్టుగా కమ్మలు.. గాజులు ధరించి ఓ మిలియన్ డాలర్ స్మైల్ ఇచ్చారు. ఈఫోటోను చూసినవారు ఈయసులో మాధురి ఇంత అందంగా ఎలా ఉన్నారు.. ఇంత ఆకర్షణ ఎలా సాధ్యం.. అనే ఆలోచన లో పడి పోవాల్సిందే. అల్లు అర్జున్ లాగా మేడమ్ సార్.. మేడ..మ్ అంతే అని చెప్పకతప్పదు.