ఫోటో స్టోరి: కిల్లర్ కియరా అంత డిమాండా!

Fri Nov 15 2019 17:02:37 GMT+0530 (IST)

Photo Story : Huge Demand For Kiara Adwani

కెరీర్ ప్రారంభించిన కేవలం నాలుగైదేళ్లలో అసాధారణ స్టార్ డమ్ సంపాదించిన కథానాయికల జాబితా తిరగేస్తే అందులో ముంబై టాప్ మోడల్ కం అందాల కథానాయిక కియరా పేరు ముందు వరుసలో ఉంటుంది. నటించింది కేవలం అరడజను సినిమాలే. కానీ క్రేజు మాత్రం పతాక స్థాయిలో ఉంది. ఎంతగా అంటే స్టార్ డైరెక్టర్స్ .. టాప్ హీరోలు.. అగ్ర నిర్మాతలు.. తనకోసం చాలాకాలంగా వెయిటింగ్. కార్పొరెట్ బ్రాండ్లు ఈ అమ్మడి వెంట డై బై డే క్యూ కడుతూనే ఉన్నాయి.గత కొంతకాలంగా ముంబైలో ఏ ఫ్యాషన్ ఈవెంట్ చూసినా కియరా కువకువలే. కిల్లింగ్ అప్పియరెన్స్ తో సాటి నాయికలకు.. టాప్ మోడల్స్ కి ఠఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. అందుకు తగ్గట్టే ఈ అమ్మడి ఖాతాలో ఇప్పటికిప్పుడు భారీ చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇండస్ట్రీ బెస్ట్ బ్రాండ్లు తన ఖాతాలో పడ్డాయి. ఇటూ అటూ ఎడా పెడా నాలుగు చేతులా ఆర్జిస్తున్న యంగ్ బ్యూటీగా కియరా పాపులరైంది. ఎం.ఎస్.ధోని -యాన్ అన్ టోల్డ్ స్టోరి- భరత్ అనే నేను చిత్రాలతో కెరీర్ ఆరంభమే బంపర్ హిట్లు అందుకుంది. లస్ట్ స్టోరీస్ తో యూత్ లో పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత తన వెంట పడని దర్శకనిర్మాత లేనేలేడు. ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తున్న భారీ చిత్రాల్లో నటించడమే గాక... కిలాడీ అక్షయ్ లాంటి స్టార్ సరసన అవకాశం అందుకుంది. లక్ష్మి బాంబ్ (అక్షయ్)- గుడ్ న్యూస్ (అక్షయ్)- ఇందూ కి జవానీ- షేర్ షా-భూల్ బులయా 2 చిత్రాలతో కియరా క్షణం తీరిక లేకుండా ఉంది.

అటు కేవలం ఉత్తరాదిన మాత్రమే కాదు.. ఇటు దక్షిణాదినా కియరాకు బోలెడంత డిమాండ్ ఉంది. అయితే బాలీవుడ్ లో బిజీ షెడ్యూల్స్ వలన ఇక్కడ కాల్షీట్లు కేటాయించలేని పరిస్థితి. మన అగ్ర కథానాయకుల్లో ప్రభాస్- చరణ్- ఎన్టీఆర్- మహేష్- బన్ని ఇంతమంది కియరా పై ఆసక్తిగా ఉన్నా.. క్షణం తీరిక లేనంతగా హిందీ పరిశ్రమలో లాక్ అవ్వడంతో కాల్షీట్లు కేటాయించలేకపోతోందట.