ఫోటో స్టొరీ: బాలీవుడ్ విషకన్య

Fri Nov 15 2019 17:53:19 GMT+0530 (IST)

Photo Story : Bollywood Dangerous Girl

బాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు లేకపోయినా.. కెరీర్ లో హిట్లు లేకపోయినా సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్న హాటు భామల్లో షమ సికందర్ ఒకరు. ఈ భామ వయసు 38.. అయినా పాతికేళ్ల  వయసేమో అనుకుంటారు. ఎడాపెడా కసరత్తులు చేస్తూ.. డైటింగులు చేస్తూ పర్ఫెక్ట్ బికినీ షేప్ ను మెయింటెయిన్ చేస్తూ ఉంటుంది.  రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటో షూట్ చెయ్యడం.. ఆ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చెయ్యడం షమ హాబీ.హాబీ అన్న తర్వాత ఒకరోజు చేసి ఊరుకోరు కదా. షమ కూడా అంతే. రీసెంట్ గా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక కొత్త ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "మనసులోని బాధను నువ్వు పో.. పో అని ఊరికే బ్రతిమాలకుండా.. ఆ బాధే మిమ్మల్ని బ్రతిమాలేలా మీరు స్ట్రాంగ్ గా తయారవ్వాలి.  ఇలా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి" అంటూ ఒక వేదాంతం టచ్ ఉండే కొటేషన్ ను క్యాప్షన్ గా ఇచ్చింది.  ఇది షమయిజం.  అందరికీ అర్థం అయ్యే బాపతు కాదు. అర్థం అయిన వారు అర్థం చేసుకోండి. లేకపోతే ఫోటోను కొంటెగా చూసి సరిపెట్టుకోండి. ఇక ఫోటో విషయానికి వస్తే ఇన్నర్ వేర్ ధరించి పైన బొత్తాలు లేని రత్తాలు లాగా ఓ తెలుపు రంగు చొక్కా వేసుకుంది.  పెద్ద కుర్చీలో ఒక లేడీ డాన్ తరహాలో కూర్చుంది.  తలపై ఒక పెద్ద హ్యాట్.. హ్యాట్ పై చేతిని పెట్టుకుంది.  డార్క్ కలర్ లిప్ స్టిక్ తో యమా హాట్ గా కనిపిస్తోంది.  బ్లాక్ అండ్ వైట్ పిక్ కావడంతో మహా కళాత్మకంగా ఉంది.  ఎవరైనా కాల్విన్ క్లెయిన్ లాంటి బ్రాండ్ వారు కనుక షమను చూస్తే.. షమ ఫ్యూచర్ లో మరో దిశా పటాని ఈ ప్రపంచానికి దక్కడం ఖాయమే.

ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.  'బేబీ.. ఇన్స్టాగ్రామ్ లో మంటలు'.. 'విష కన్యలా ఉన్నావు'.. 'హాటెస్ట్ బ్యూటీ'.. '100 కు110 మార్కులు' అంటూ తమ స్పందనలు తెలిపారు. సినిమాల విషయానికి వస్తే ఈమధ్యే షమ నటించిన 'బైపాస్ రోడ్' రిలీజ్ అయింది.  ఆ సినిమా తర్వాత మరే సినిమా ఆఫర్ దక్కలేదు.