మహేష్ తో గురూజీ.. వైరల్ అవుతున్న ఫోటో..!

Sat Mar 18 2023 15:56:14 GMT+0530 (India Standard Time)

Photo Moment Ever Handsome Mahesh With His Director Trivikram

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ లో నిర్మిస్తున్నారు. సినిమాలో పూజా హెగ్దే శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే కంపోజింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా సినిమా మరో షెడ్యూల్ స్టార్ట్ చేయగా సెట్స్ లో మహేష్ త్రివిక్రం మరో నటుడు జయరాం తో కలిసి దిగిన ఫోటో బయటకు వచ్చింది.త్రివిక్రమ్ సినిమాల్లో జయరాం ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆల్రెడీ ఆయన చేసిన అల వైకుంఠపురములో సినిమాలో కూడా జయరాం నటించారు. ఇక ఇప్పుడు మహేష్ సినిమాలో కూడా ఆయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. క్యాజువల్ గా ముగ్గురు కలిసి దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో వీరిద్దరి మధ్య ర్యాపో కూడా బాగా కుదిరిందని తెలుస్తోంది. మహేష్ తో స్క్రీన్ షేర్ చేయడం గురించి తన సంతోషాన్ని వెల్లడించారు జయరాం.

కృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను ఇప్పుడు ఆయన తనయుడితో సినిమాలు చేస్తున్నానని జయరాం తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు. మహేష్ తో ఒకసారి కలిసి నటిస్తే వారు మళ్లీ మళ్లీ నటించాలని అనుకుంటారు. ఇక త్రివిక్రమ్ మహేష్ కాంబో విషయానికి వస్తే ఆల్రెడీ అతడు ఖలేజా సినిమాలు చేశారు కాబట్టి ఈ కాంబోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సర్కారు వారి పాట తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాతో ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఏప్రిల్ 28న ముందు రిలీజ్ అనుకున్న ఈ సినిమా కాస్త ఆగష్టుకి వాయిదా పడింది. మరి అనుకున్న విధంగా ఆగష్టు 11న రిలీజ్ చేస్తారా లేదా అన్నది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.