Begin typing your search above and press return to search.

వివాదాస్ప‌ద జీవోపై AP ప్రభుత్వానికి విన్న‌పం

By:  Tupaki Desk   |   18 April 2021 12:30 PM GMT
వివాదాస్ప‌ద జీవోపై AP ప్రభుత్వానికి విన్న‌పం
X
వకీల్ సాబ్ ని దెబ్బ తీయ‌డ‌మే ధ్యేయంగా ఏపీ ప్ర‌భుత్వం తెచ్చిన టిక్కెట్టు ధ‌ర‌ల జీవో ఎగ్జిబిష‌న్ రంగంలో ఒక పెద్ద కుదుపు. పెద్ద సినిమాల‌తో పాటు చిన్న సినిమాలు రిలీజ్ చేసేవాళ్ల‌కు ఇది పెద్ద తల‌నొప్పి వ్య‌వ‌హారంగా మారింది. ఎగ్జిబిట‌ర్లు పంపిణీదారుల‌తో పాటు నిర్మాత‌ల‌కు కంటిపై కునుకు క‌రువ‌య్యేలా చేసింద‌న్న వాద‌న బ‌ల‌ప‌డుతోంది. స‌రిగ్గా వ‌కీల్ సాబ్ విడుదలకు ఒక రోజు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద జీవో35 ను జారీ చేసింది. వకీల్ సాబ్ టికెట్ రేట్లను పెంచేందుకు అనుమ‌తుల్ని ర‌ద్దు చేస్తూ.. ఎగ్జిబిటర్లు పంపిణీదారులకు నోటీసులు పంపింది. కానీ ఇది ఆచ‌ర‌ణీయ యోగ్యం కానిది అంటూ పంపిణీదారులు ఎగ్జిబిట‌ర్లు ఇప్పుడు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు. క‌రోనా మహమ్మారి కారణంగా అనేక నెలల థియేటర్లు మూసివేశాక‌.. ఇప్పటికే అనేక కష్టాలను ఎదుర్కొంటున్న చలన చిత్ర ప్రదర్శనకారుల కష్టాలను ఏక‌రువు పెడుతూ.. కొత్త టికెట్ రేట్లు ఆచరణీయంగా కనిపించనందున చాలా థియేటర్లు మూసివేస్తామ‌ని హెచ్చ‌రించారు. చెప్పినది చెప్పిన‌ట్టే చేస్తున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ AP ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. జారీ చేసిన G.O ని పునః పరిశీలించమని అభ్యర్థిస్తూ.. దీనివ‌ల్ల‌ కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని లేఖ‌లో సీఎంకి తెలిపారు. ఎపి సిఎం వైయస్ జగన్ .. ఎపి ప్రధాన కార్యదర్శికి వారు రాసిన లేఖలో ఎగ్జిబిటర్లు టికెట్ రేట్లపై పరిమితి అసంబ‌ద్ధ‌మ‌ని వారు గతంలో పన్నురహిత నిర్వహణ ఛార్జీలను కూడా చెల్లించి క‌ష్టాల్ని ఎదుర్కొన్నామ‌ని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత జీఎస్టీ విధానం వల్ల పన్ను రహిత వ్యవస్థ ఉనికిలో లేదు. కాబట్టి టికెట్ ధర నిర్వహణ ఛార్జీలు జీఎస్టీతో కూడిన కొత్త టికెట్ రేట్లతో కొత్త జి.ఓ.ని జారీ చేయాలని ఎగ్జిబిటర్లు ఎపి ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. జిఎస్‌.టి విభాగం జారీ చేసిన మునుపటి బి-ఫారమ్ ను కూడా ఎగ్జిబిటర్లు అటాచ్ చేశారు. ఎ సెంటర్లలోని థియేటర్లలో టికెట్ రేట్లను సవరించాలని ఎగ్జిబిటర్లు అధికార వైయస్ ఆర్సీపి ప్రభుత్వాన్ని కోరారు. రూ.40 ప్లస్ నిర్వహణ ఛార్జీలు.. తక్కువ తరగతికి రూ .100 ప్లస్ నిర్వహణ ఛార్జీలు హై క్లాస్ కోసం రూ .40 నుండి 100 మధ్య ఏదైనా ధర ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. ఈ ధ‌ర‌ల‌కు ప‌న్ను అద‌నంగా యాడ్ చేయాల్సి ఉంటుంద‌ని నివేదించారు. నిర్వహణ ఛార్జీలతో పాటు టిక్కెట్ల ధ‌ర‌ల్లో పన్నులు యాడ్ చేయాల‌ని నివేదించారు.

గత ఏడాది లాక్ డౌన్ సందర్భంగా 3 నెలలు విద్యుత్ ఛార్జీలను మాఫీ చేసినందుకు ఎగ్జిబిటర్స్ బాడీ సిఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. మహమ్మారి కారణంగా థియేటర్లను 9 నెలలు మూసివేస్తున్నందున మరో 3 నెలలు విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయాలని వారు సిఎంను కోరారు.

ఎగ్జిబిటర్లు తమ థియేటర్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని బి .. సి సెంటర్లలో సౌకర్యాలను ఎ-సెంటర్లలో థియేటర్ల ప్రమాణాలకు సరిపోయేలా కలిగి ఉన్నారని లేఖలో పేర్కొంది. A- B - C కేంద్రాల నుండి వచ్చిన థియేటర్లకు విద్యుత్ ఛార్జీలు P.F.. E.S.I నిర్వహణ ఛార్జీలు GST లలో తేడా లేదని కూడా పేర్కొంది.