Begin typing your search above and press return to search.

సింపుల్ ఫ్యామిలీ నుంచి `వరుడు కావలెను`

By:  Tupaki Desk   |   14 Jan 2021 7:54 AM GMT
సింపుల్ ఫ్యామిలీ నుంచి `వరుడు కావలెను`
X
ఉమ్మ‌డి కుటుంబ వ్య‌వ‌స్థ‌పై సినిమాలు అరుదుగానే వ‌స్తున్నాయి. అప్ప‌ట్లో శ‌త‌మానం భ‌వ‌తి.. అమ్మ‌మ్మ గారిల్లు లాంటివి ఉమ్మ‌డి కుటుంబ వ్య‌వ‌స్థ‌పై వ‌చ్చిన ఆస‌క్తిక‌ర సినిమాలు. ఆ త‌ర్వాత అడ‌పాద‌డ‌పా వ‌చ్చినా పెద్దంత‌గా ఆక‌ట్టుకోలేదు. యాక్ష‌న్ మాఫియా హార‌ర్ సినిమాల న‌డుమ ఇలాంటివి ఆడియెన్ కి బిగ్ రిలీఫ్ గా వ‌స్తుంటాయి.

ప్ర‌స్తుతం మ‌రో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా వ‌స్తోంది. నాగ‌శౌర్య‌- రీతు వ‌ర్మ జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా టైటిల్ `వ‌రుడు కావ‌లెను`. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఒక సింపుల్ ఫ్యామిలీ స్టోరీ ఇద‌ని అర్థ‌మ‌య్యేలా సంక్రాంతి పోస్ట‌ర్ ని డిజైన్ చేసి రిలీజ్ చేసింది చిత్ర‌బృందం. వరుడు కావలెను కుటుంబం ఒకే ఫ్రేమ్ ‌లో క‌నిపించి `సంక్రాంతి శుభాకాంక్షలు` పంప‌డం ఆక‌ట్టుకుంది.

ఈ పోస్టర్ లో యువ జంటతో పాటు మురళి శర్మ-న‌దియా ఉన్నారు. అయితే ఆ ఇద్ద‌రూ ఎవరి తల్లిదండ్రులు నాగ‌శౌర్య‌.. రీతూ.. ఇద్ద‌రిలో ఎవ‌రికి పేరెంట్..! అన్న‌ది క‌న్ఫ్యూజ‌న్ గా ఉంది. ఇంత‌కుముందే రిలీజైన టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ వ‌స్తుంద‌ని శౌర్య అభిమానులు వేచి చూస్తున్నారు. ఈలోగానే పోస్ట‌ర్ల‌తో ప్ర‌చారంలో స్పీడ్ పెంచుతోంది టీమ్. సితారా ఎంటర్ టైన్మెంట్స్ ప‌తాకంపై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.