అందమైన నవ్వులో పడి నలిగిపోవాల్సిందే మరి!

Sat May 14 2022 20:00:01 GMT+0530 (IST)

Pelli Sandadi heroine sri leela new photo

`పెళ్లి సందD` సినిమాతో పరిచయమైన యంగ్ బ్యూటీ శ్రీలీల వెలుగు జిలుగుల గురించి చెప్పాల్సిన పనిలేదుల. అమ్మడు అందం..అభినయంతో తొలి సినిమాతోనే మాయ చేసింది. సినిమా సక్సెస్ సంగతి పక్కనబెడితే.. అందంతోనే మతులు పోగొట్టింది. ఇప్పుడీ  20 ఏళ్ల బ్యూటీపైనే అందరి కళ్లు ప్రసరిస్తున్నాయి.తమ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేయాలని పోటీ పడుతున్నారు కొంత మంది యువ నిర్మాతలు.  స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకూ అంతా శ్రీలీల వైపు ఓ  లుక్ వేసిన వారే. మరి ఈ విషయం తెలిసిన శ్రీలీల ఊరకనే ఎందుకుంటుంది? ఆ ఛాన్సులు అందుకునే వరకూ తను చేయాల్సిన ప్రయత్నాలు అంటూ కొన్ని ఉంటాయిగా.

ప్రస్తుతం శ్రీలీల అదే పనిలో ఉంది. `పెళ్లి సందడి` రిలీజ్ అనంతరం శ్రీలీల ఫోటో షెషన్లపై ఏకాగ్రత పెట్టిన సంగతి తెలిసిందే. అందాలు ఆవిష్కరించకుండా తనదైన శైలిలో ఇన్ స్టా వేదికగా  హీటెక్కిస్తుంది. తాజాగా సముద్రం నడిబొడ్డున ఇలా సేద తీరుతూ చిక్కింది.  

తెలుపు రంగు దుస్తుల్లో ఒళ్లంతా కప్పేసుకుని ఇలా సముద్రం అందాల మధ్యలో చిలౌట్ అవుతుంది.  సాయంసంధ్యా వేళలో ఇలా కెమెరాకి  చిక్కింది. ఆ నవ్వు మాయలో ఎవరైనా పడి నగిలిపోవాల్సిందే అన్నంత అందంగా స్మైల్ ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

యువ నాయిక లైనప్  విషయానికి వస్తే రవితేజకు జోడీగా `ధమాకా` లో నటిస్తుంది. ఆ సినిమా మాత్రమే కాకుండా బాలకృష్ణ సినిమాలో కూడా  కీలక పాత్రకు ఎంపిక అయ్యిందని ప్రచారం సాగుతోంది.  ప్రభాస్ సినిమాలో ఒక హీరోయిన్ గానూ శ్రీలీలని ఎంపిక చేయాలని మారుతి చర్చలు జరుపుతున్నాడనే ప్రచారం ఉంది. మొత్తానికి శ్రీలీల వచ్చే ఏడాదికి స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారుతుందేమో చూడాలి.

శ్రీలీల ఇటీవలే ఎంబీబీఎస్ చివరి సంవత్సరం  పూర్తిచేసింది. ఫలితాల్లో మంచి మెరిట్ వచ్చిందిట. మరోవైపు విదేశాల్లో ఎంఎస్ చేసే ఆలోచన ఉందిట. డాకర్ట్ కాబోయి  యాక్టర్ అయిన బ్యూటీ ఆమె.