Begin typing your search above and press return to search.

థై షోస్ తో మ‌త్తెక్కిస్తున్న RX 100 బ్యూటీ

By:  Tupaki Desk   |   27 Oct 2021 4:30 PM GMT
థై షోస్ తో మ‌త్తెక్కిస్తున్న RX 100 బ్యూటీ
X
పంజాబీ బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ సోష‌ల్ మీడియాల్లో ఎంత స్పీడ్ గా ఉంటోందో తెలిసిందే. నిరంత‌రం హాటెస్ట్ ఫోటోషూట్ల‌తో మ‌త్తెక్కించ‌డం కొత్తేమీ కాదు. కెరీర్ ఆరంభం నుంచి ఆందాల ఆర‌బోత‌లో స్పెష‌లిస్టుగానే రిజిస్ట‌ర్ అయ్యింది. డెబ్యూ మూవీ ఆర్.ఎక్స్ 100లో వేడెక్కించే రొమాన్స్ తో యూత్ ఫేవ‌రెట్ గా మారిపోయింది. తొలి చిత్రంతోనే బోలెడంత పాపులారిటీ ద‌క్కించుకుంది. అటుపై సోష‌ల్ మీడియా ప్ర‌చారంతో మ‌రింతగా ఫోక‌స్ అయింది. ప్ర‌స్తుతం న‌టిగా పాయ‌ల్ కెరీర్ హ్యీపీగానే సాగిపోతోంది. తాజాగా మ‌రో స్పెషల్ ఫోటో షూట్ తో అద‌ర‌గొట్టింది. థై-థండ‌ర్ షోస్ తో ఇన్ స్టాని పాయ‌ల్ షేక్ చేస్తోంది.

తాజా ఫోటో షూట్ లో ఈ బ్యూటీ పూర్తిగా థై అందాల ఎలివేష‌న్ పైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. పాయ‌ల్ ఫాలోవ‌ర్స్ హాట్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఇక పాయ‌ల్ కెరీర్ విష‌యానికి వ‌స్తే `ఆర్.ఎక్స్ 100` సినిమాతో పాయ‌ల్ రాజ్ పుత్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అటుపై కొంత మంది అగ్ర హీరోల చిత్రాల్లోనూ అవ‌కాలు అందుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. ఈనేప‌థ్యంలో కోలీవుడ్ లోనూ అవ‌కాశాలు అందుకుంటోంది. అలాగే క‌న్న‌డ‌లో ఓ డాన్ స్టోరీలో న‌టిస్తోంది.

బెంగుళూరు సిటీని మొట్ట మొద‌ట‌గా గ‌డ‌గ‌డలాడిండించిన జ‌య‌రాజ్ బ‌యోపిక్ `హెడ్ బుష్` టైటిల్ తో తెర‌కెక్కుతోంది. ఇందులో డాన్ మొద‌టి గాళ్ ప్రెండ్ పాత్ర‌లో న‌టిస్తోంది. జ‌య‌రాజ్ కి చాలా మంది గాళ్ ప్రెండ్స్ ఉండ‌గా పాయ‌ల్ పోషించే పాత్ర మాత్రం చాలా కీల‌క‌మైన‌ది. డాన్ జీవితంలో కొన్ని మార్పులు సైతం తీసుకొచ్చిన రోల్ అది. ఈ నేప‌థ్యంలో పాయ‌ల్ పాత్ర‌కు మంచి పేరు వ‌చ్చే అవ‌కాశం ఉంది.