Begin typing your search above and press return to search.

#పాయ‌ల్‌.. కన్ను మూస్తే నీ రూపం.. ఎవ‌రే అత‌గాడు?

By:  Tupaki Desk   |   25 Jan 2021 3:30 AM GMT
#పాయ‌ల్‌.. కన్ను మూస్తే నీ రూపం.. ఎవ‌రే అత‌గాడు?
X
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల.. నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేల.. ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా .. ఇదిగో ఇపుడె చూసా సరిగా.. ఇన్నాళ్ళు నేనున్నది ...నడిరేయి నిదురలోన...!! (`ఆనందం` సినిమాలోనిది ఈ క్లాసిక్ సాంగ్. దేవీశ్రీ మైండ్ బ్లాక్ చేసే సంగీతం ఇచ్చారు. అందుకే ఆ ట్యూన్ ఇప్ప‌టికీ గుండెల్లో మార్మోగుతుంది)

పాపం.. పాప పాయ‌ల్ స‌న్నివేశం ఇలానే ఉంది మ‌రి. ఇలాంటి క‌ష్టం ప‌గోడికైనా రాకూడ‌దు. అలా గోడ వాలుగా వాలిపోయే ప‌గ‌టిపూటే క‌ల‌లు కంటోంది. అన్న‌ట్టు ఆ క‌ల‌లో ఎవ‌రు క‌నిపిస్తుంటారు? అంటే.. ఇంకెవ‌రు..? త‌న పంజాబీ మామ కం ప్రియుడు క‌నిపిస్తాడ‌ని ఇట్టే అభిమానులు క‌నిపెట్టేస్తారు. నో యువ‌ర్ హ్యాపీనెస్ అంటూ డీప్ డ్రీమ్ లోకి వెళ్లింది మ‌రి.

ఇంత‌కుముందు త‌న ప్రేమికుడితో క‌లిసి ఉన్న ఫోటోషూట్ల‌తో తాను ఒంట‌రిని కాద‌ని ఎప్పుడూ క‌లల లోకంలో విహ‌రిస్తుంటాన‌ని చెప్ప‌క‌నే చెప్పింది. ఇక పాయ‌ల్ కెరీర్ అంతంత‌మాత్రంగానే ఉన్నా టాలీవుడ్ లో కొత్త దారులు వెత‌క‌డంలో స‌క్సెస‌వుతోంది. ఇప్ప‌టికే ఆర్.ఎక్స్ 100 ద‌ర్శ‌కుడితో మరో సినిమాకి క‌మిటైంది. యాంజెల్ అనే ఓ త‌మిళ చిత్రంలోనూ నాయిక‌గా న‌టిస్తోంది. ప‌లు చిత్రాల్లో ఐటెమ్ నంబ‌ర్ల‌కు సంత‌కాలు చేయ‌నుంద‌ని స‌మాచారం.