నాది ఓవర్ యాక్షన్ కాదు.. నాకు నిజంగా భయం వేసింది

Wed Sep 30 2020 06:00:01 GMT+0530 (IST)

It's not my over action. It's really scary for me

హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో వైరల్ అయ్యింది. ఒక షూటింగ్ లో భాగంగా ముందు అందరికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమెకు కూడా కరోనా పరీక్ష చేయించుకుంది. కరోనా పరీక్ష కోసం ముక్కు నుండి శాంపిల్ ను సేకరిస్తారు అనే విషయం తెల్సిందే. కరోనా పరీక్ష కోసం పాయల్ ముక్కు నుండి శాంపిల్ తీస్తున్న సమయంలో ఆమె ఏడ్చింది. పైగా ఆ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసింది. దాంతో నెటిజన్స్ ఆమెను ఒక ఆట ఆడేసుకున్నారు. మరీ ఓవర్ యాక్షన్ చేశావు... ఇంజక్షన్ కు భయపడటంలో ఒక అర్థం ఉంది. ముక్కు నుండి శాంపిల్ తీయడంలో ఏముంది అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.తన వీడియోకు పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించింది. తనకు డాక్టర్లు అన్నా.. సూదులు అన్నా కూడా చాలా భయం. ముక్కు నుండి శాంపిల్ తీసే సమయంలో నాకు నిజంగా చాలా భయం వేసింది. ఆ సమయంలో నాకు చాలా ఏడుపు వచ్చింది. దాన్ని కొందరు ఫేక్ అనుకుంటున్నారు. దానికి నేను ఏమీ చేయలేను. నా భయంను ట్రోల్ చేయడం అన్యాయం.. దారుణం అంటూ పాయల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈమె ప్రస్తుతం ఇంకా టైటిల్ ఖరారు కాని సినిమాతో పాటు ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుందట.