అడల్ట్ కంటెంట్ తో మరో హిట్టు కొడుతుందా?

Thu Oct 10 2019 21:52:12 GMT+0530 (IST)

Payal Rajput RDXLove Movie

గతేడాది వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు 'ఆర్.డి.ఎక్స్ లవ్' తో థియేటర్స్ లోకి రానుంది.  సినిమాకు సంబంధించి పాయల్ గ్లామరే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. కథ కూడా పాయల్ చుట్టూనే తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది కూడా. అయితే ఆర్ ఎక్స్ 100 లో కథ - కార్తికేయ నటన తర్వాత పాయల్ గ్లామరే హైలైట్ గా నిలిచింది.సినిమాలో అమ్మడి అందానికి ఫిదా అయిన కుర్రకారు మళ్ళీ మళ్ళీ ఆ సినిమాను చూసారు. అయితే అదే ఆలోచనతో ఆర్.డి.ఎక్స్ 100 లో కూడా కథకు మించి రోమాన్స్ మోతాదు పెంచారు. టీజర్ లో కాండం అనే పదం తప్ప మిగతాదేమి లేదు. ట్రైలర్ లో మాత్రం అడల్ట్ కంటెంట్ తో పాటు ఊరి సమస్య కూడా ఉందని చూపించారు.

ప్రస్తుతం సినిమాలో ఉన్న కంటెంట్ కంటే ఎక్కువగా పాయల్ గ్లామరే హైలైట్ చేస్తున్నారు మేకర్స్. పాయల్ గ్లామర్ షో మీదే సినిమాకు మంచి బిజినెస్ కూడా జరిగిందనే టాక్ ఉంది. పోస్టర్స్ లో కూడా పాయల్ అందాలనే చూపిస్తూ ఎట్రాక్ట్ చేస్తున్నారు. మరి పాయల్ మళ్ళీ అడల్ట్ కంటెంట్ తో హిట్టు కొడుతుందా చూడాలి.