Begin typing your search above and press return to search.

పిక్ టాక్: ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్న పాయల్.. హాట్ నెస్ ఓవర్ లోడెడ్...!

By:  Tupaki Desk   |   19 Oct 2020 4:30 PM GMT
పిక్ టాక్: ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్న పాయల్.. హాట్ నెస్ ఓవర్ లోడెడ్...!
X
బుల్లితెరపై తన హవా చూపించిన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.. బాలీవుడ్ లో 'వీరే కీ వెడ్డింగ్' అనే సినిమాలో నటించింది. ఇక 'Rx 100' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమై కుర్రకారుని తనవైపు తిప్పేసుకుంది. ఈ సినిమాతో క్రేజీ ఆఫర్స్ వస్తాయనుకున్న పాయల్ కు 'RDX 100' లాంటి చిన్న చిత్రాలలో నటించే అవకాశం మాత్రమే దక్కింది. 'వెంకీ మామ' సినిమాలో వెంకటేష్ కి జోడీగా కనిపించి అలరించింది. సినిమా హిట్ అయినా పాయల్ కి మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక 'సీత' సినిమాలో ఐటెం సాంగ్ కి స్టెప్పులేసి అదరగొట్టింది. ఆ తర్వాత రవితేజ సరసన 'డిస్కోరాజా' సినిమాలో నటించినప్పటికీ పరాజయం పలకరించింది. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. అయితేనేం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ హోరెత్తిస్తోంది.

తాజాగా ఆరోగ్యంగా ఉండటానికి వర్కౌట్స్ చేయాలని చెప్తూ ఇంస్టాగ్రామ్ లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. స్కై బ్లూ జిమ్ అవుట్ ఫిట్స్ ధరించి ఆబ్స్ చూపిస్తోంది. డంబెల్స్ పట్టుకొని ఓ రేంజ్ లో పోజ్ ఇచ్చింది. వీటికి ''నేను ఎంత దూరం వెళ్ళగలననేది చూద్దాం.. ఎట్ లీస్ట్ స్లో ప్రోగ్రెషన్ అనేది నో ప్రోగ్రెషన్ కంటే మంచిది.. 63 నుండి 58 కిలోలు.. డియర్ ఆబ్స్, నేను మిమ్మల్ని ఇప్పుడు చూడకపోవచ్చు. కాని మీరు ఏదో తీవ్రంగా తయారు చేస్తున్నారని నేను భావిస్తున్నాను.. చివరకు మిమ్మల్ని కలవడానికి వెయిట్ చేయలేకపోతున్నాను'' అని క్యాప్షన్ పెట్టింది. అమ్మడి అందాన్ని చూసిన రసిక హృదయాలు ఈ ఫోటోలకు కామెంట్స్ పెట్టడమే కాకుండా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ఈ బ్యూటీ ప్ర‌స్తుతం తెలుగులో జ‌యంత్ సి ప‌రాన్జీ దర్శకత్వంలో 'నరేంద్ర' అనే సినిమాలో నటిస్తోంది. అలానే తమిళ్ లో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ 'ఏంజెల్' లో కూడా పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది.