పాపం పాయల్ లో ఇంత ఆవేదన ఉందా?

Sun Jan 20 2019 20:11:07 GMT+0530 (IST)

Payal RajPut about His Brother Missing

'ఆర్ ఎక్స్ 100' చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫేం ఉన్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఐటెం సాంగ్స్ తో పాటు అన్ని రకాలుగా ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ అమ్మడు పైకి చాలా జాలీగా కనిపిస్తున్నా మనసులో మాత్రం పుట్టెడు బాధను దాచుకున్నట్లుగా తాజాగా వెళ్లడైంది. ఈమె సోదరుడు తప్పిపోయి మూడు సంవత్సరాలు అయ్యిందట. ఆ మూడు సంవత్సరాలుగా కుటుంబ సభ్యులు అంతా కూడా అతడి కోసం వెదుకుతూనే ఉన్నారట.నేడు అతడి పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియాలో ఆ విషయాన్ని పాయల్ రాజ్ పూత్ షేర్ చేసుకుంది. తన 25 ఏళ్ల సోదరుడు ధృవ్ రాజ్ పూత్ మార్చి 27 2016 నుండి కనిపించకుండా పోయాడు. అప్పటి నుండి కూడా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఎన్నో సార్లు పోలీసులను కలిశాం వారు కూడా ప్రయత్నించారు ఫలితం లేకుండా పోయిందని పాయల్ ఆవేదనగా పోస్ట్ చేసింది.

హ్యాపీ బర్త్ డే ధృవ్ నీ కోసం మేము ఈ మూడేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాం. నువ్వు ఎక్కడైనా చిక్కుకుని ఉంటే ఎలాగైనా ఒక్క కాల్ చేయి మేమంతా కూడా నీ కోసం ఎదురు చూస్తున్నాం. నువ్వు ఎక్కడున్నా ఈ మెసేజ్ చూస్తావని ఆశిస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో ఫైడ్ ధృవ్ హ్యాష్ ట్యాగ్ ను పోస్ట్ చేసింది. పాయల్ ట్వీట్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఆమె సోదరుడు దొరకాలని చాలా మంది కోరుకుంటూ ఆమె పోస్ట్ ను షేర్ చేస్తున్నారు.