Begin typing your search above and press return to search.

పాయల్ పాప పై శంకర్ కన్ను పడిందా...?

By:  Tupaki Desk   |   28 May 2020 7:50 AM GMT
పాయల్ పాప పై శంకర్ కన్ను పడిందా...?
X
భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో శంకర్ ఒకరు. ఆయన సినిమాలో ఒక్కసారి కనిపించినా చాలు అని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కోరుకుంటూ ఉంటారు. స్టార్ హీరో హీరోయిన్స్ సైతం డైరెక్టర్ శంకర్ తో సినిమా తీయాలని ఆరాటపడుతూ ఉంటారు. ఆయన డేట్స్ అడిగితే మిగతా సినిమాలు పక్కన పెట్టి మరీ డేట్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కనిపించే ఛాన్స్ ఒక ముద్దుగుమ్మకు దక్కిందట. వివరాల్లోకి వెళ్తే డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో 'ఇండియన్ 2' సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై బడా నిర్మాత సుభాష్‌ కరణ్‌ 'ఇండియన్ 2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా 1996లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా వస్తోంది. ఈ సినిమాలో క‌మ‌ల్ డ్యూయ‌ర్ రోల్ చేస్తున్నారని.. విల‌న్ అండ్ హీరో పాత్రల్లో కమల్ కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా భాగం కంప్లీట్ అవ్వాల్సిన ఈ సినిమా అనుకోని అవాంతరాల వలన లేట్ అవుతూ వస్తోంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో శంకర్ భారీ స్థాయిలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసాడట. అయితే ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్ లో ఐటమ్ భామగా ఎవరు స్టెప్పులు వేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ సాంగ్ కోసం 'Rx 100'తో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ని అనుకుంటుంటున్నారట. దీనికి పాయల్ పాప కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. పాయల్ ఐటెం సాంగ్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇందకముందు 'సీత' సినిమాలో 'బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి' అనే ఐటెం సాంగ్ లో స్టెప్పులేసింది. ఇప్పుడు 'ఇండియన్ 2' లో ఐటమ్ సాంగ్ చేసేది నిజమైతే అమ్మడు లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే. గతేడాది టాలీవుడ్ లో చేసిన 'వెంకీమామ' 'డిస్కో రాజా' సినిమాలలో నటించిన పాయల్ కి మంచి పేరైతే వచ్చింది కానీ ఛాన్సెస్ మాత్రం రాలేదు. దీంతో తమిళ్ మార్కెట్ లోకి ఎంటర్ అవుదాం అని ప్లాన్ చేసుకుంది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలో 'ఏంజెల్' అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ కంట్లో పడిందని వార్తలు వస్తున్నాయి. మరి ఇదే కనుక నిజమై పాయల్ కోలీవుడ్ లో పాగా వేస్తుందేమో చూడాలి.