Begin typing your search above and press return to search.

రానా తో పోరాటానికి పవన్ రెడీ.. #PSPKRana షూటింగ్ ఎప్పుడంటే..?

By:  Tupaki Desk   |   20 Jun 2021 12:30 AM GMT
రానా తో పోరాటానికి పవన్ రెడీ.. #PSPKRana షూటింగ్ ఎప్పుడంటే..?
X
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుండటంతో మేకర్స్ అంతా తమ సినిమాల షూటింగులను తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు రీస్టార్ట్ అయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో చాలా రోజులుగా ఇంటికే పరిమితమైన పవన్ కళ్యాణ్ కూడా సెట్స్ లో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం రానా దగ్గుబాటితో కలిసి ఆయన నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ తెలుగు రీమేక్ షూట్ జులై 11 నుంచి ప్రారంభిస్తారని సమాచారం. ఈ షెడ్యూల్ లో పవన్ తో పాటుగా రానా కూడా పాల్గొనున్నారు.

ఇప్పటికే 40 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తికాగా.. వీలైనంత త్వరగా #PSPKRana సినిమాని కంప్లీట్ చేయాలని పవన్ భావిస్తున్నారు. దీని కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో దీని కోసం స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ - రానా ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నాను. ఈ చిత్రంలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. అతనికి పోటీగా నిలిచే రిటైర్ట్ హవల్దార్‌ గా రానా కనిపించనున్నారు. ఇద్దరిలో ఉండే ఇగో కారణంగా వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఈ చిత్ర కథ.

పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్టులో పలు మార్పులు చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో లేని ఫ్లాష్ బ్యాక్ ని యాడ్ చేస్తున్నారు. ఇందులో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నాడు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ.. నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాని రూపొందిస్తున్నారు.