మహేష్ ని లైట్ తీసుకున్నాడా.. మరిచాడా?

Wed Jan 15 2020 23:00:01 GMT+0530 (IST)

Pawan kalyan Wishes for Only Mega heroes

సంక్రాంతి  కానుకగా బన్ని- అలవైకుఠపురములో ...క్రిస్మస్ కానుకగా సాయితేజ్ -ప్రతి రోజు పండగే రిలీజై హిట్లు కొట్టి మెగా కాంపౌండ్ లో సరికొత్త ఉత్సాహం నింపాయి. ఆ ఇద్దరికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ హీరోలిద్దరికి ప్రేమతో  పవన్ ఎర్ర గులాబీలు పంపారు. దాంతో పాటే ఓ లేఖ రాసి పంపించారు. బన్ని-సాయితేజ్ విషయంలో పవన్ ఇంతగా ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. కేవలం చిరంజీవి-రామ్ చరణ్ సినిమాలపైనే ఇలాంటి స్పందనలు కనిపించేవి.ఆ ఇద్దరికీ మాత్రమే వ్యక్తిగతంగా ఇంటికెళ్లి విష్ చేస్తారు పవన్. అయితే ఈసారి బన్ని- సాయితేజ్ లకు ఆ ఛాన్స్ దక్కింది. ఇలాంటి సన్నివేశం చాలా రేర్ గానే జరుగుతుంటుంది. పవన్ ప్రస్తుత  పొలిటికల్ సినారియోని బట్టి రెస్సాండ్ కావడం అన్నది ఆసక్తి రేకెత్తించేదే. ఇదే సంక్రాంతి కి సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు రిలీజై సక్సెస్ అయింది. కానీ మహేష్ కు మాత్రం పవన్ విషెస్ చెప్పలేదు.

మరి మహేష్ మ్యాటర్ పవన్ మర్చిపోయారా?  లేక బిజీ షెడ్యూల్స్ లో ఉండడం వల్ల  లైట్ తీసుకున్నారా? అన్న చర్చ ఇరువురి హీరోల అభిమానుల్లో నడుస్తోంది. చిన్న చిన్న హీరోలు... సినిమాలు విషయంలో సైతం స్పందించే పవన్  ఇంత పెద్ద స్టార్ ని విష్ చేయకపోవడం ఏమిటా అంటూ ఫిల్మ్ మీడియాలో సైతం ఆసక్తికర చర్చ సాగుతోంది. మహేష్ తో పవన్ కి స్నేహం కూడా ఉంది కాబట్టి సరిలేరు సినిమా చూసి అప్పుడు రెస్పాండ్ అవుతారేమో చూడాలి. తాజా కథనాలకి పవన్ రెస్పాండ్ అవుతారా? అన్నది చూడాలి. త్వరలో పవన్  పింక్ రీమేక్ తో రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.