Begin typing your search above and press return to search.

పవన్ మూవీ అంటే చాలు కోట్ల వర్షం

By:  Tupaki Desk   |   31 July 2021 3:49 AM GMT
పవన్ మూవీ అంటే చాలు కోట్ల వర్షం
X
‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత ఫుల్ టైం పాలిటిక్స్‌లో బిజీ అయిన జనసేనాని పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ ఫిల్మ్‌తో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ సినిమా తర్వాత వరుస సినిమాలు ఒప్పుకుని మెగా అభిమానులకు ఆనందం కలుగజేశారు. వరుసగా సినిమా షూటింగ్స్‌లో బిజీగా గడుపుతున్నారు పవన్. తాజాగా మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నాడు. పోలీసు ఆఫీసర్ భీమ్లా నాయక్‌గా పవన్ నటిస్తున్నాడు, ఇందుకు సంబంధించిన ఫొటోలను మూవీ యూనిట్ సభ్యులు ఇటీవలే విడుదల చేయగా, అవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

మరో సారి ‘గబ్బర్ సింగ్’ మాదిరి పవన్ పోలీసు పాత్ర పోషించడం పట్ల ఆయన అశేష అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ అవుతున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు రూ. 23 కోట్లకు అమ్ముడు పోయాయంటూ టాలీవుడ్ వర్గాల వారు చెబుతున్నారు. సాధారణంగా రీమేక్ సినిమాలకు ఇంత డబ్బు ఇవ్వరు. కానీ, మలయాళ మాతృక నుంచి స్టోరీ లైన్ తీసుకుని పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు మార్పులు చేసి, ఫైట్లు జోడించి సినిమాను కమర్షియల్‌గా రూపొందిస్తారనే నమ్మకంతోనే ఇంత రేటుకు హిందీ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘బాహుబలి’ సినిమాతో రానా దగ్గుబాటి నార్త్ ప్రజలకు సుపరిచితం కాగా, ఈ చిత్రంతో పవన్ నార్త్ వారికి మరింత దగ్గరయ్య చాన్సెస్ ఉన్నాయి. ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ రైట్స్‌కు కూడా మేకర్స్ భారీ రేటు కోట్ చేస్తున్నారట. రూ.44 కోట్లకు శాటిలైట్ రైట్స్ ఇస్తామని యూనిట్‌ సభ్యులు పేర్కొంటూ ‘జీ’ సంస్థకు తెలిపినట్లు సమాచారం. అయితే, వాళ్లు ఎంత వరకు కోట్ చేయబోతున్నారనేది ఇంకా తెలియ రాలేదు. ఇక సినిమా విషయానికొస్తే మలయాళంలో తెరకెక్కిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మల్టీ టాలెంటెడ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజుమీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ పాత్రలను పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి పోషిస్తున్నారు. అయితే, తెలుగులో నేటివిటికి తగ్గట్లు భారీ స్థాయిలోనే మార్పులు ఉండే అవకాశాలున్నాయి.

పవన్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్లు డైలాగ్స్‌తో పాటు సొసైటీలో అవేర్‌నెస్ కలిగించే అంశాలను జోడించనున్నారు. ఈ రీమేక్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నా సాగర్.కె.చంద్ర పవన్ వీరాభిమాని కాగా, మాటలు అందిస్తున్నది పవన్ ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా ఇలా ఉండగానే ప్యారలల్‌గా పవన్ ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో పవన్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ చిత్రంలో ఓ షెడ్యూల్ పూర్తి చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. హరి హర వీరమల్లు అయిపోయాక ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా పవన్‌ చేయబోతున్నాడు.