Begin typing your search above and press return to search.

ఫొటోస్టోరీ : పవన్‌26 లుక్‌ ఇదేనా?

By:  Tupaki Desk   |   20 Jan 2020 10:15 AM GMT
ఫొటోస్టోరీ : పవన్‌26 లుక్‌ ఇదేనా?
X
అజ్ఞాతవాసి చిత్రం తర్వాత సినిమాలకు దూరం అయిన పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ ఇన్నాళ్లకు కెమెరా ముందుకు వచ్చాడు. బాలీవుడ్‌ హిట్‌ మూవీ 'పింక్‌' రీమేక్‌ తో పవన్‌ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా పింక్‌ రీమేక్‌ లో పవన్‌ అంటూ వార్తలు వచ్చాయి. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సందర్బం రానే వచ్చింది. ఫ్యాన్స్‌ పవన్‌ కళ్యాణ్‌ నేడు కెమెరా ముందుకు రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌ మొదటి రోజు షూటింగ్‌ లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా లొకేషన్‌ లో పవన్‌ కళ్యాణ్‌ ఫొటో లీక్‌ అయ్యింది.

ఈ లీక్డ్‌ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. పవన్‌ ఫ్యాన్స్‌ ప్రస్తుతం చాలా ఎమోషనల్‌ గా ఈ ఫొటోను ట్వీట్స్‌ చేస్తున్నారు. చాలా మంది అభిమానులకు పవన్‌ రాజకీయాల్లో ఉండటం కంటే సినిమాల్లో ఉండటం ఇష్టం అంటున్నారు. ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవన్‌ కెమెరా ముందుకు రావడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.

రెండు నెలల్లోనే ఈ చిత్రంను పూర్తి చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఫొటో లీక్‌ అయిన తర్వాత పవన్‌ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రీమేక్‌ లో పవన్‌ కళ్యాణ్‌ లాయర్‌ గా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. చాలా విభిన్నమైన పాత్ర అవ్వడంతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేని పాత్ర అయినా కూడా పవన్‌ ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఈ చిత్రం కోసం వెయిట్‌ చేస్తున్నారు.