సూపర్ స్టార్ ని ఫాలో అవుతున్న పవర్ స్టార్

Sat Oct 12 2019 10:23:38 GMT+0530 (IST)

2018 మేలో సూపర్ స్టార్ రజనీకాంత్ హరిద్వార్- కాశీ ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే పలుమార్లు ఆయన హిమాలయాల్లోనూ పర్యటించారు. ప్రతి ట్రిప్ ని ఆయన ఎంతో ఆస్వాధిస్తూనే ఉంటారు. `బాబా` సినిమా టైమ్ లోనే తనకు హిమాలయాలకు వెళ్లి అక్కడ రుషుల్లో కలవాలనుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. మౌనమునిగా మారి తపస్సు చేసుకోవాలని ఉందని అన్నారు. తనను శివైక్యం చేసుకోవాలనుందని.. ధార్మిక జీవనానికి తనని తాను సంసిద్ధం చేసుకుంటున్నానని తెలిపారు. ఆ క్రమంలోనే అతడు సినిమాలు వదిలి ఇలా మనశ్శాంతి కోసం తపిస్తున్నారని అభిమానులు భావించారు. అసలు బాబా సినిమా తీయడానికి స్ఫూర్తి ఆయన హిమాలయాల విజిట్. కానీ ఆయన ఆశించినది వేరు.. రియాలిటీలో జరుగుతోంది వేరు.ప్రస్తుతం జనసేనాని పవన్ కల్యాణ్ ట్రిప్ చూస్తుంటే ఆయన కూడా సూపర్ స్టార్ రజనీనే అనుసరిస్తున్నారా? అంటూ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ అడుగులు అలానే కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో అవిశ్రాంతంగా శ్రమిస్తూ ఎందరో కొత్త తరహా మనుషుల్ని చూశారు. చూస్తూనే ఉన్నారు. రంగుల ప్రపంచంతో పోలిస్తే వాస్తవ లోకం ఎలా ఉందో.. పొలిటికల్ లైఫ్ ఎంత హారిబుల్ గా ఉంటుందో కూడా అనుభవమైంది. అందుకేనేమో.. ఆయనలో మారిన కొత్త మనిషి కనిపిస్తున్నారు.

ప్రస్తుతం హరిద్వార్ రుషికేష్ ట్రిప్ లో ప్రశాంత చిత్తుడైన జనసేనాని పవన్ కల్యాణ్.. ప్రకృతిని ఆస్వాధిస్తూ యోగిని తలపిస్తున్నారు. హరిద్వారాలోని పుణ్య గంగలో స్నానాదులు ఆచరించి అక్కడ దేవాలయాల్లో పూజలు పునస్కారాలు ఆచరిస్తున్నారు. ఖాళీ సమయాల్లో ధార్మికతకు సంబంధించిన పుస్తకాల్ని తనవద్ద ఉన్న ట్యాబ్ లోనే అభ్యసిస్తున్నారు. ఈ టూర్ లో ఆయన పూర్తిగా ఎంతో సాధాసీదాగా ఉండే దుస్తుల్ని ధరించారు. ప్రకృతి జీవనానికి పవన్ ఇచ్చే ప్రాధాన్యత కూడా తాజాగా రివీలైన ఫోటోల్ని చూస్తే అర్థమవుతోంది. హరిద్వారలోని ఓ ఆశ్రమ కాటేజ్ లో ఆయన ఉన్నప్పటి ఫోటోలు తాజాగా రివీలై అభిమానుల్లోకి జనసైనికుల్లోకి దూసుకెళుతున్నాయి.