స్టార్ రైటర్ ని ఆడుకుంటున్న పవన్ ఫ్యాన్స్!

Wed Feb 01 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Pawan fans playing star writer!

టాలీవుడ్ లో ఒక దశలో స్టార్ రైటర్ గా ఓ వెలుగు వెలిగిన వ్యక్తి కోన వెంకట్. రైటర్ గా సూపర్ హిట్ లు బ్లాక్ బస్టర్ లు చూసిన కోన వెంకట్ ఆ తరువాత ఆ స్థాయిలో సక్సెస్ లని దక్కించుకోలేక తన ఫామ్ ని కోల్పోయాడు. రీసెంట్గా మంచు విష్ణు 'జిన్నా'తో ఫరవాలేదనిపించుకున్న కోన వెంకట్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య'తో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. బాబి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి తనతో పాటు చక్రవర్తి రెడ్డితో కలిసి కోన వెంకట్ కూడా మాటలు అందించాడు.ఈ మూవీ రీసెంట్ గా సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. అంతే కాకుండా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి చిరు కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సినిమా అందించిన సక్సెస్ జోష్ తో వున్న కోన వెంకట్ ప్రస్తుతం మరిన్ని క్రేజీ సినిమాలకు పని చేయబోతున్నాడు. రీసెంట్ గా సోమవారం లాంచనంగా పూజా కార్యక్రమాలతో మొదలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న గ్యాంగ్ స్టర్ మూవీ ఓపెనింగ్ సెర్మనీలో కోన వెంకట్ సందడి చేశాడు.

సుజీత్ దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ మూవీని డీవీవీ దానయ్య అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నారు. ఇందులో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా 'పంజా' తరహా పాత్రకు మించి ఇందులో కనిపించనున్నారట. ఇదిలా వుంటే ఈ మూవీ పూజా కార్యక్రమాల్లో కోన వెంకట్ పాల్గొన పవన్ కల్యాణ్ తో కలిసి సందడి చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గతంలో పవన్ నా సోల్ మేట్ అంటూ స్టేట్మెంట్ లిచ్చిన కోన వెంకట్ ఆ తరువాత వైసీపీకి చెందిన మీడియాలో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ కల్యాణ్ పై గత కొన్నేళ్ల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాంటి కోన మళ్లీ ఇప్పుడు పవన్ పక్కన చేరడంతో అభిమానులు ఫైర్ అవుతున్నారట. గతంలో విమర్శలు గుప్పించిన కోన ఇప్పుడు ఎలా పవన్ పంచన చేరుతున్నాడని సోషల్ మీడియా వేదికగా పవన్ అభిమానులు కోనపై మండిపడుతున్నారని తెలుస్తోంది.

కోణ వ్యవహారశైలి అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నచందంగా వుందని అభిమానులు ఘాటుగా కామెంట్ లు చేస్తున్నారట. 'ఓజీ' ఓపెనింగ్ లో పవన్ తో వున్న ఫొటోలని కోన వెంకట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈ పోస్ట్ పై పవన్ అభిమానులు విరుచుకుపడుతున్నారట. ఇప్పటికే 119 మంది కామెంట్ లు చేయగా అవి కనిపించకుండా కోన జాగ్రత్తలు తీసుకుంటున్నాడని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.