మహేశ్ సినిమాతో నిరాశకు గురైన పవన్ ఫ్యాన్స్..!

Fri May 13 2022 12:08:18 GMT+0530 (India Standard Time)

Pawan fans disappointed with Mahesh movie

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ''సర్కారు వారి పాట'' సినిమా భారీ అంచనాల మధ్య నిన్న గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పరశురాం పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచ్చుకుంది.SVP లో మహేష్ మెరిసిపోయాడు కానీ.. పరశురాం పూర్తిగా నిరాశపరిచాడని ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు. సూపర్ స్టార్ ను సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయిన దర్శకుడు.. కథను చెప్పడంలో ఫెయిల్ అయ్యారని అంటున్నారు.

ఇక 'సర్కారు వారి పాట' సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారని తెలుస్తోంది. దీనికి కారణం మూవీలో తమ ఫేవరేట్ హీరో రెఫరెన్స్ ఉపయోగించడమే అని చెప్తున్నారు.

ఈ సినిమాలో నటుడు సుబ్బరాజు ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇందులో అతని రింగ్ టోన్ గా పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమాలోని 'లాలా భీమ్లా..' అనే సూపర్ హిట్ సాంగ్ ఉపయోగించబడింది. దీంతోనే ఇప్పుడు పీకే ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారని అంటున్నారు.

సినిమాలో మహేష్ బాబు తరచుగా సుబ్బరాజుకు ఫోన్ చేసి టార్చర్ పెడుతూ ఉంటారు. కాల్ చేసిన ప్రతీసారి 'లాలా భీమ్లా' రింగ్ టోన్ ప్లే అవుతుంటుంది. ఈ విధంగా సుబ్బారాజును పవన్ ఫ్యాన్ గా చూపించడానికి ప్రయత్నించారని అంటున్నారు.

అంతేకాదు అతన్ని మహేశ్ ఆడుకున్నట్లు చూపించి పరోక్షంగా పీకే ఫ్యాన్స్ ను టార్గెట్ చేశారని కొందరు బాధ పడుతున్నారు. మరికొందరు మాత్రం సక్సెస్ కోసం మహేశ్ సినిమాలో పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ వాడుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే భీమ్లా నాయక్ రింగ్ టోన్ ని పెట్టడం నెగెటివ్ గా తీసుకోలేం. SVP మేకర్స్ ఇంటెన్స్ అదేనని అనుకోలేం. ఎందుకంటే 'లాలా భీమ్లా' పాట ఇటీవల కాలంలో చార్ట్ బస్టర్స్ లలో ఒకటి. అందులోనూ సర్కారు వారి పాటలు సమకూర్చిన ఎస్ఎస్ థమనే ఆ ట్యూన్ ని కంపోజ్ చేశారు.

బాగా పాపులర్ అయిన సాంగ్ కావడంతో దాన్ని సినిమాలో పెట్టి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు. ఏదైతేనేం 'సర్కారు వారి పాట' సినిమాలో భీమ్లా నాయక్ రింగ్ టోన్ వచ్చిన సన్నివేశాలు చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.