Begin typing your search above and press return to search.

అబ్బాయ్ టైటిల్ ని బాబాయ్ లాక్కోడ‌మేంటి?

By:  Tupaki Desk   |   5 Dec 2022 4:50 AM GMT
అబ్బాయ్ టైటిల్ ని బాబాయ్ లాక్కోడ‌మేంటి?
X
సామాజిక మాధ్య‌మాల్లో ఫ్యాన్ వార్ ఇటీవ‌ల మ‌రీ హ‌ద్దుమీరుతోందా? దుర్భాష‌ల‌తో రాజ‌కీయ‌ కుట్ర‌ల‌తో ఇవి మ‌న హీరోల‌ను తీవ్రంగా హ‌ర్ట్ చేస్తున్నాయా? అంటే అవున‌నే ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుస వినిపిస్తోంది.

నిజానికి ఏ ఒక్క అభిమాని త‌న ఫేవ‌రెట్ హీరో పేరుతో అదే ఫ్యామిలీకి చెందిన‌ ఇంకో హీరోని తిట్టాల‌ని అనుకోడు. ఈరోజుల‌లో అంత తెలివిత‌క్కువ ఫ్యాన్స్ ఉన్నార‌ని కూడా అనుకోలేం. గోడ పోస్ట‌ర్ రోజుల్లో ఇలాంటివి జ‌రిగేవి ఏమో కానీ ఇప్ప‌టి ఆడియెన్ కానీ ఫ్యాన్స్ కానీ చాలా అడ్వాన్స్ డ్. ప్రతిదీ స్వ‌యంగా విశ్లేషించుకోగ‌ల స‌మ‌ర్థులు.

దీనిని బ‌ట్టి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటూ అభిమానుల పేరుతో ఒక సెక్ష‌న్ చేస్తున్న హంగామా చూస్తుంటే ఇది క‌చ్ఛితంగా పొలిటిక‌ల్ కుయుక్తుల‌ ప్రొప‌గండా అని మెగా కాంపౌండ్ భావిస్తోంది. నిన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా లాంచ్ కాగానే ఒక సెక్ష‌న్ స్పంద‌న అనూహ్యంగా క‌నిపించింది. OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే టాపిక్ విస్త్ర‌తంగా చ‌ర్చ‌ల్లోకొచ్చింది. సోష‌ల్ మీడియాల్లో మెగా ఫ్యాన్స్ పేరుతో కొన్ని గ్రూపులు డిబేట్లు పెట్టాయి. వాస్త‌విక మెగా ఫ్యాన్స్ లో ఈ టైటిల్ కి గూస్ బంప్స్ వ‌చ్చాయి. దీంతో ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకున్నారు. కానీ RRR బ్లాక్ బస్టర్ విజయం సాధించాక‌ రామ్ చరణ్ అభిమానులు త‌మ ఫేవ‌రెట్ హీరోని OG అని కొనియాడుతున్నారు.

ఇప్పుడు ఓజీ అనే ట్యాగ్ ని పవన్ కళ్యాణ్ లాక్కుంటున్నారా? అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ లో ఒక వర్గం కామెంట్లు చేయ‌డం క‌నిపిస్తోంది. నిజానికి అబ్బాయ్ టైటిల్ ని బాబాయ్ లాక్కోడ‌మేంటి సిత్రంగాను! అంటూ దీనికి కామెంట్లు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే ఇంత చిన్న విష‌యానికి సామాజిక మాధ్యమాల్లో అభిమానుల పేరుతో దుర్భాష‌లు త‌గునా? ఇదంతా ఒరిజిన‌ల్ ఫ్యాన్స్ చేసే పనేనా? ఇందులో ఇంకేదైనా రాజ‌కీయ కుట్ర దాగి ఉందా? అన్న సందేహాలు కూడా రేకెత్తుతున్నాయి.

ప్ర‌జ‌ల‌కు నేరుగా త‌మ సొంత డ‌బ్బును కోట్ల‌లో ధార‌పోస్తూ.. సామాజిక సేవ‌లో ఉన్న ఇద్ద‌రు మెగా హీరోల‌ను ఇష్టానుసారం నెటిజ‌నులు ట్రోల్ చేయ‌డం చూస్తుంటే మ‌రీ దారుణంగా ఉంది అంటూ కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. రాజ‌కీయ ఎజెండాల‌ను సినిమాకి అంట‌గ‌ట్టి ఇక్క‌డ స్టార్ల‌ను బ‌ద‌నాం చేసే కుయుక్తి ప‌న్నారా? అంటూ సందేహాలు రాజుకుంటున్నాయి.

అస‌లు ఈ అభిమానులు కాని అభిమానులు సోష‌ల్ మీడియాల్లో ఎంత‌గా గంద‌ర‌గోళం సృష్టిస్తున్నారంటే...చరణ్ ఫ్యాన్స్ లోని ఒక వర్గం పవన్ కళ్యాణ్ ని రాజకీయాల్లో ఫెయిల్ అంటూ వ్యంగ్యంగా దునుమాడుతున్నారు. కొంతమంది పవన్ అభిమానులు చరణ్ కి సొంత ఫ్యాన్ బేస్ లేనేలేద‌ని.. చిరు - పవన్ అభిమానులే ఆదుకుంటున్నార‌ని కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో ఇలాంటి విషం చిమ్మేది అభిమానులు అని ఎవ‌రూ భావించ‌డం లేదు. దీనివెన‌క ఏం జ‌రుగుతోందో తెలుసుకోవాల‌ని ఇప్ప‌టికే మెగా కాంపౌండ్ సైతం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇక‌పై సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్ గ్రూపుల పేరుతో ఎవ‌రు ప్ర‌వేశిస్తున్నారు? అన్న‌దానిపైనా ఆరాలు కొన‌సాగుతున్నాయి. నిజ‌మైన అభిమాని ఎవ‌రు? మేక వ‌న్నె తోడేలు ఎవ‌రు? అన్న‌ది క‌నిపెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలిసింది. బాబాయ్ కి అబ్బాయ్ కి గొడ‌వ‌లు పెట్టే రాజ‌కీయాలు ఇకపై చెల్ల‌కుండా దీనికి ఒక మెగా క‌మీష‌న్ కూడా ఏర్పాటైన‌ట్టు స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.