Begin typing your search above and press return to search.

పవన్ సుజిత్ మూవీ.. ఇలా అయితే కష్టం!

By:  Tupaki Desk   |   28 Jan 2023 10:00 PM GMT
పవన్ సుజిత్ మూవీ.. ఇలా అయితే కష్టం!
X
పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇక రాజకీయాలతో సినిమా షూటింగ్స్​కు డేట్స్ కూడా సరిగ్గా ఇవ్వలేక పోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కొన్ని సెట్స్​పైకి మరికొన్ని స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. అందులో సాహో డెరెక్టర్​ సుజిత్​ సినిమా కూడా ఒకటి ఉంది. అయితే ఈ చిత్రం గురించి ఫ్యాన్స్​కు షాకింగ్ అండ్ సర్​ప్రైజ్​ వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే పవన్​ కల్యాణ్​ అంటేనే ఎనర్జీ సాంగ్స్​, డైలాగ్స్​, ఫైట్స్​.

వాటిని చూసి అభిమానులు ఫుల్​ ఖుషీ అవుతుంటారు. కాలర్ ఎగరేసి తిరుగుతుంటారు. అలాంటిది సుజిత్​ సినిమాలో పవన్​కు ఫైటింగ్స్, సాంగ్స్​ ఉండవట. వాటిని లేకుండానే కథను నడిపిస్తారట సుజిత్​.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే అభిమానులు ఈ చిత్రాన్ని ఆస్వాదించగలరా? ఎంజాయ్ చేయగలరా? అసలీ ఎక్స్ పెరిమెంట్​ సక్సెస్​ అవుతుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇలా అయితే సినిమాను నడిపించడం కష్టమనే చెప్పాలి.

ఇకపోతే ఈ సినిమా గురించి విషయానికొస్తే.. డీవీవీ ఎంటర్‌టైనర్స్‌ దీన్ని నిర్మిస్తోంది. పవన్​కు సంబంధించి ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసి దీన్ని ప్రకటన చేశారు. 'ఫైర్‌ స్ట్రోమ్‌ ఇజ్‌ కమింగ్‌' అనే వ్యాఖ్యను జోడించారు.

పోస్టర్‌ పై THEY CALL HIM #OG అని కూడా రాశారు. పోస్టర్ ఆధారంగా ఇది గ్యాంగ్‌స్టర్‌ మూవీ అని అర్థమవుతోంది. మరి ఇందులో పవన్​కు ఫైట్స్​ ఎందుకు లేవో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

కాగా, ఆర్ఆర్ఆర్‌ లాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలు తీసిన డీవీవీ ఎంటర్‌టైనర్స్‌ నుంచి వస్తున్న ఈ చిత్రానికి రవి.కె.చంద్రన్ డీవోపీ అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఇకపోతే పవన్‌ ఈ చిత్రంతో పాటు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహరవీరమల్లులో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీనితోపాటు హరీశ్‌ శంకర్‌తో కలిసి భవదీయుడు భగత్‌సింగ్‌ తో అలరించనున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.