2 భాగాలుగా పవన్ OG.. టెర్రిఫిక్ క్లైమాక్స్కు ప్లాన్

Tue Jan 31 2023 12:01:30 GMT+0530 (India Standard Time)

Pawan OG in 2 parts.. Plan for Terrific Climax

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సాహో డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో భారీ యాక్షన్ డ్రామా చిత్రం 'OG' రూపొందుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభమైంది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా పంజా సాహా లాంటి అవుట్ పుట్ కాకుండా కేజీయఫ్ పఠాన్ లాంటి ఫలితం దక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు.మరో ఆసక్తికర విషయమేమిటంటే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. తొలి భాగాన్ని త్వరగా పూర్తి చేసి ఈ దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీని కోసం భారీగా పవన్ డేట్స్ కోవాలని సుజిత్ కోరారట. ఈ తొలి భాగంలో ఓ టెర్రిఫిక్ క్లైమాక్స్ను ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అదే ఈ చిత్రానికి హైలైట్ కానుందట. ఎలాగైనా ఈ చిత్రం హిట్ కొట్టి భారీగా కమ్ బ్యాక్ ఇవ్వాలని సుజిత్ భావిస్తున్నారట. మరి ఏం జరుగుతందో చూడాలి.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఒక్క అనౌన్స్మెంట్ పోస్టర్తోనే సోషల్ మీడియా షేక్ అయింది. సాహో లాంటి హై యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత దాదాపు నాలుగేళ్లు విరామం తీసుకుని సుజిత్ ఈ కథను సిద్ధం చేశాడు. ఇందులో పవన్ గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. పైగా అతడు పవన్కు సుజీత్ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఏ లెవల్లో ఉంటుందో అని అభిమానులందరూ భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు.

ఇంకా ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ అందుకున్న తర్వాత డీవీవీ.. ఈ సినిమా చేయడం కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో విషమేమిటంటే.. ఈ సినిమా నిర్మాణంలో అల్లు అరవింద్ కూడా భాగస్వామ్యం కానున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన సైలెంట్గా బడ్జెట్తో పెట్టబడులు పెట్టనున్నారని కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు.

ఇకపోతే గ్రాండ్గా జరిగిన మూవీ లాంఛ్ ఈవెంట్లో ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. సురేష్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. దిల్రాజు అరవింద్ దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందించారు.

ఈ మూవీ లాంచ్ ఈవెంట్లో పవన్ గ్రాండ్ ఎంట్రీ పిక్స్ సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. పవన్ ఈజ్ బ్యాక్ యంగ్ లుక్లో కనిపిస్తున్నారని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్ శ్రీవాస్ వివేక్ ఆత్రేయ బీవీఎస్ఎన్ ప్రసాద్ ఏఎం రత్నం తదితరులు పాల్గొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.