పిక్ టాక్ : నలుగురు పిల్లలతో పవన్ కళ్యాణ్

Wed Jan 19 2022 09:25:19 GMT+0530 (IST)

 Pawan Kalyan with four children

పవన్ కళ్యాణ్ కు రేణు దేశాయ్ ద్వారా ఇద్దరు పిల్లలు.. వారు అకీరా మరియు ఆద్య లు కాగా ప్రస్తుత భార్య అన్నా లెజినోవా ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొత్తం నలుగురు పిల్లలకు పవన్ తండ్రి అనే విషయం తెల్సిందే. రేణు దేశాయ్ తో విడి పోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ పిల్లల విషయంలో పూర్తి బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటాడు. అకీరా మరియు ఆద్య ల విషయమై అన్ని తానై పవన్ కళ్యాణ్ చూసుకుంటూ ఉంటాడు అనే విషయం తెల్సిందే. ఇంట్లో వేడుకలు మొదలుకుని ప్రత్యేక సందర్బాల్లో పవన్ కళ్యాణ్ వారిని కలవడం.. తీసుకు వెళ్లడం వంటివి చేస్తూ ఉంటాడు. వారు రేణు దేశాయ్ వద్ద ఉంటున్నా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో కూడా తరచు కలుస్తూనే ఉంటారు.తాజాగా పవన్ నలుగురు పిల్లలతో ఇలా కనిపించాడు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ను ఆయన నలుగురు పిల్లలతో చూసిందే లేదు. కాని మొదటి సారి ఇలా ఒక సందర్బంలో పవన్ నలుగురు పిల్లలతో సందడి చేశాడు. ఈ ఫొటోలో ఆయన భార్య అన్నా లెజినోవా కూడా ఉండటం విశేషం. పవన్ నలుగురు పిల్లలు కూడా కలిసి పోయి ఉండటంను ఈ ఫొటోలో చూడవచ్చు. ఇద్దరు అమ్మాయిలు ఒకే తరహా డ్రస్ ధరించడంతో పాటు పవన్ కళ్యాణ్ మరియు అకీరాలు కూడా ఒక తరహా డ్రస్ లో కనిపించడం చూస్తుంటే ఇదేదో కాకతాళీయంగా జరిగిన మీటింగ్ కాదు.. రెగ్యులర్ గా ప్లాన్ చేసుకుని జరుపుకునే వేడుకలో భాగంగా వీళ్లు కలిశారు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో బయట కనిపించడం చాలా తక్కువ. క్రిస్మస్ వేడుక కోసం అన్నా దేశం అయిన రష్యాకు వెళ్లి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత న్యూ ఇయర్ వేడుకలను మొత్తం కుటుంబంతో ఇలా జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ న్యూ ఇయర్ వేడుకల తర్వాత అకీరాకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. అతడు ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాడు. రేణు దేశాయ్ కూడా ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ తో మళ్లీ ఇలాంటి ఒక ఫొటోను మనం చూస్తామా అంటూ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఎప్పుడు ఇలాగే నలుగురు పిల్లలతో సంతోషంగా గడపాలంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.