OG.. ఉస్తాద్ కంటే ముందుగానే..

Tue Jan 31 2023 16:10:05 GMT+0530 (India Standard Time)

Pawan Kalyan to complete Sujith OG before Ustad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాదిలో ఏకంగా నాలుగు సినిమాలని చేతిలో పెట్టుకున్నాడు. కాని సినిమాలు చేయడానికి తన దగ్గర ఉన్న టైమ్ మాత్రం చాలా తక్కువ అని చెప్పాలి. జనసేన పార్టీతో ఓ వైపు ఏపీలో రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కి 2024 ఎన్నికలు చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే పార్టీని నడపడానికి ఫండ్స్ కావాల్సి ఉండటంతో గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేయడానికి పవన్ రెడీ అయిపోయాడు. ఈ సినిమాల ద్వారా వచ్చే రెమ్యునరేషన్ అటు రాజకీయాల కోసం వెచ్చిస్తున్నాడు.



ఈ నేపధ్యంలో ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పై ఉంది. దానిని కంప్లీట్ చేయాలి. ఈ లోపే సుజిత్ దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ మూవీ ఓపెనింగ్ కార్యక్రమంతో స్టార్ట్ చేసేశాడు.

మరో వైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీగా ఉంది. పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడా అనే హరీష్ శంకర్ వెయిట్ చేస్తున్నాడు.

అలాగే సముద్రఖని దర్శకత్వంలో వినోదాయసిత్తం మూవీ కూడా సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది. ఇలా నాలుగు సినిమాల కోసం కాల్ షీట్స్ ని పవన్ ఈ ఏడాది గ్యాప్ తీసుకోకుండా అడ్జస్ట్ చేయాలి.

ఈ నేపధ్యంలో ఏ సినిమా ముందు చేస్తాడు అనేది మాత్రం ఇటు ప్రేక్షకులలోని అటు ఫ్యాన్స్ లో కూడా కన్ఫ్యూజింగ్ గా ఉంది. అయితే ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ చేస్తూనే సుజిత్ మూవీ కూడా వీలైనంత వేగంగా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసి పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.

వేసవి లోపు ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. అనంతరం ఉస్తాద్ భగత్ సింగ్ ని వినోదయ సిత్తం సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లుగా టాక్. దీనిని బట్టి ఉస్తాద్ భగత్ సింగ్ కంటే ముందుగా సుజిత్ ఓజీని పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చెప్పుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.