యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్న పవన్ కళ్యాణ్..?

Tue Apr 05 2022 15:04:18 GMT+0530 (India Standard Time)

Pawan Kalyan giving a chance to a young director..?

'వకీల్ సాబ్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. వరుసగా సినిమాలు సైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడు డేట్స్ అడ్జెస్ట్ చేస్తారు.. ఎప్పుడు సినిమా కంప్లీట్ చేస్తారనేది తెలియనప్పటికీ.. జోరుగా కొత్త ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం క్రిష్ జాగర్లమూడి - హరీష్ శంకర్ - సురేందర్ రెడ్డి వంటి స్టార్ డైరెక్టర్లు ఎదురు చూసే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు పవన్ ఓ యువ దర్శకుడితో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

'భీమ్లా నాయక్' సినిమాతో సాగర్ కె.చంద్ర కు అవకాశం ఇచ్చిన పవన్.. ఇప్పుడు సుజిత్ కు ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. ఇంతకుముందు 'రన్ రాజా రన్' 'సాహో' వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన సుజీత్.. పవర్ స్టార్ హీరోగా డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి.

ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. 'లార్గోవిచ్' ఫ్రీమేక్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ కంటే సుజీత్ బెటర్ గా డీల్ చేశాడని భావించి పవన్ కళ్యాణ్ ఈ ఆఫర్ ఇస్తున్నారేమో అనే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

గతంలో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అజ్ఞాతవాసి' మరియు ప్రభాస్ తో సుజిత్ చేసిన 'సాహో' సినిమాలు.. ఫ్రెంచ్ మూవీ 'లార్గోవిచ్' కు ఫ్రీమేక్ అంటూ నెటిజన్లు విమర్శించిన సంగతి తెలిసిందే.

ఇదిలా వుంటే సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన 'వినోదియ సీతం' అనే తమిళ సినిమా రీమేక్ కు పవన్ ఓకే చెప్పినట్లు సమాచారం. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నారు. త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్ బాధ్యతలు చూసుకుంటున్నారని టాక్.

అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే లోపు పవన్ ఓ నెల రోజులు 'హరి హర వీరమల్లు' సినిమాకే డేట్స్ కేటాయించారని తెలుస్తోంది. దర్శక నిర్మాతలు ఇప్పటికే సెట్స్ రెడీ చేసి పెట్టుకొని ఉన్నారు. ఈ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాతే పవన్ కొత్త సినిమా మొదలు పెడతారని టాక్.

ఇకపోతే మైత్రీ బ్యానర్ లో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని హరీష్ శంకర్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. జూన్ లో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తామని దర్శకుడు ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం 'ఏజెంట్' సినిమా తో బిజీగా ఉన్న సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ సంగతి తర్వాత తెలుస్తుంది.

ఇప్పుడు లేటెస్టుగా సుజీత్ తో పవన్ ఓ సినిమా చేస్తారని అంటున్నారు. అంతేకాదు పవన్ - వైష్ణవ్ తేజ్ ల కోసం త్రివిక్రమ్ దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉందనే టాక్ ఉంది. మరి పవన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు ఈ సినిమాలన్నీ పూర్తి చేస్తాడో లేదో చూడాలి.