Begin typing your search above and press return to search.

#PSPKRana: పవర్ ఫుల్ పోలీసాఫీసర్ 'భీమ్లా నాయక్' గా పవన్ కళ్యాణ్..!

By:  Tupaki Desk   |   26 July 2021 9:26 AM GMT
#PSPKRana: పవర్ ఫుల్ పోలీసాఫీసర్ భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్..!
X
పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి మలయాళ బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనుమ్ కొశీయున్' చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. '#PSPKRana' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ఈరోజు తిరిగి ప్రారంభమైంది. తాజా షెడ్యూల్ లో పవన్ అడుగుపెట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో 'భీమ్లా నాయక్' అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నట్లు తెలిపారు.

'ఏకే' రీమేక్ షూటింగ్ రీ స్టార్ట్ అయిన సందర్భంగా కొద్దిసేపటి క్రితం పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పవన్ ఇందులో ఖాకీ యూనిఫామ్ ధరించి పోలీస్ ఆఫీసర్ గెటప్ లో అలరిస్తున్నారు. పవర్ స్టార్ ఫేస్ కనిపించనప్పటికీ మళ్లీ ఖాకీలో తమ అభిమాన హీరోని చూస్తున్నందుకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో షూటింగ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పవన్ కళ్యాణ్ - రానా ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌ లో చిత్రీకరించనున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి 'హరి హర వీరమల్లు' సినిమా చిత్రీకరణ ప్రారంభించాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో పవన్‌ కు జంటగా నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

'#PSPKRana' చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.