Begin typing your search above and press return to search.

చేతులు మారిన వకీల్ సాబ్‌

By:  Tupaki Desk   |   14 Jan 2021 6:32 AM GMT
చేతులు మారిన వకీల్ సాబ్‌
X
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వకీల్ సాబ్‌ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది. సినిమా కోసం పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్‌ హిట్‌ మూవీ పింక్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాను వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. బోణీ కపూర్‌ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శృతి హాసన్‌ కీలక గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతుంది. ఇక హీరోయిన్‌ లు అంజలి మరియు నివేథా థామస్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా టీజర్ సంక్రాంతి సందర్బంగా రాబోతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా బిజినెస్‌ ను ఇప్పటికే దిల్ రాజు మొదలు పెట్టాడు.

సినిమా శాటిలైట్‌ రైట్స్ ను జెమిని టీవీ దక్కించుకుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జీ తెలుగు వారికి ఈ సినిమా రైట్స్ దక్కినట్లుగా తెలుస్తోంది. జెమిని టీవీ వారు ఈ సినిమా రైట్స్ ను కొనుగోలు చేసే విషయమై వెనక్కు తగ్గడంతో జీ తెలుగు వారు ఈ సినిమాను దాదాపుగా 15 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

జెమిని టీవీ వారి కంటే అధికంగా జీ తెలుగు వారు వకీల్‌ సాబ్ కు ముట్టజెప్పుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్న నేపథ్యంలో నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తోంది. థియేట్రికల్‌ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్మడు పోయే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్‌ లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.

--