వీరమల్లు ఈ ఏడాది చివర్లోనే… నమ్మొచ్చా?

Sat Apr 01 2023 09:56:19 GMT+0530 (India Standard Time)

Veeramallu at the end of this year... can you believe it?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమైంది. అయితే కరోనా కారణంగా మొదటి రెండేళ్లు గ్యాప్ తీసుకున్న తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ కారణంగా సినిమా రిపీటెడ్ గా వాయిదా పడుతూ వస్తుంది. అప్పుడప్పుడు సినిమాకి డేట్స్ కేటాయిస్తూ పవన్ కళ్యాణ్ షూటింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.



ఇదిలా ఉంటే ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. శ్రీరామనవమి సెలబ్రేషన్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కాస్ట్యూమ్స్ లో క్రిష్ తో పాటు కనిపించారు. ఏప్రిల్ 5 నుంచి మరల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారు.

మే నెలలో సుజిత్ దర్శకత్వంలో తెరకక్కుతున్న ఓజీ మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అయితే హరిహర వీరమల్లు పాన్ ఇండియా లెవెల్ సినిమా అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ షూటింగ్ విషయంలో మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది ఆఖరిలో హరిహర వీరమల్లు సినిమాని రిలీజ్ చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు.

 అయితే ఇదే మాట సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి చెబుతున్నప్పటికి కూడా పూర్తిస్థాయిలో షూటింగ్ కంప్లీట్ కాలేదు. మరి ఈసారైనా అనుకున్న ప్రకారం ఈ ఏడాది ఆఖరుకి సినిమాని ప్రేక్షకులకు అందిస్తారా అనేది ప్రశ్నగానే ఉంది.

పవన్ కళ్యాణ్ కేటాయించి డేట్స్ బట్టి సినిమా షూటింగ్ ఎంత వేగంగా కంప్లీట్ అవుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఓవైపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఏపీలో రాజకీయంగా యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు చేతిలో మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో ఉన్నాయి.

వీటిని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు. పొలిటికల్ గా మళ్లీ ఎప్పుడు బిజీ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఆలస్యం చేస్తూ ఉన్న కొద్ది ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతూ ఉంటాయి. ప్రజాభిప్రాయం కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. అదే సమయంలో సినిమాలు షూటింగ్స్ లేట్ చేస్తే నిర్మాతలు అనుకున్న బడ్జెట్ కంటే రెట్టింపు అయిపోతుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ వీలైనంత వేగంగా మూవీల షూటింగ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.