Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ద‌స‌రా పందెం.. అభిమానుల‌కు ఈసారి నిరాశేనా?

By:  Tupaki Desk   |   10 Oct 2020 8:50 AM GMT
ప‌వ‌న్ ద‌స‌రా పందెం.. అభిమానుల‌కు ఈసారి నిరాశేనా?
X
ఇదిగో వ‌చ్చేస్తున్నాం! అంటూ రిలీజ్ కోసం కంగారు ప‌డ‌డం త‌ప్ప సినిమాని శ‌ర‌వేగంగా పూర్తి చేసి ప్ర‌చారం ప‌రంగా స‌రైన కంటెంట్ ని రివీల్ చేయ‌డంలో ప‌లువురు అగ్ర ద‌ర్శ‌కులు ఫెయిల‌వుతున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కుముందు ఆర్.ఆర్.ఆర్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తార‌క్ అభిమానుల్ని అలానే నిరాశ‌ప‌రిచారు. యంగ్ య‌మ బ‌ర్త్ డేకి అదిరిపోయే టీజ‌ర్ రిలీజ్ చేస్తార‌ని కొమురం భీమ్ లుక్ ఎలా ఉంటుందో చూడాల‌ని అభిమానులు ఆశ‌ప‌డితే వాటిపై నిర్ధ‌య‌గా రాజ‌మౌళి నీళ్లు చ‌ల్లారు.

ఇప్పుడు ద‌స‌రా సంద‌ర్భంగా వ‌కీల్ సాబ్ టీజ‌ర్ స‌హా ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న సినిమాల లుక్ ల‌న్నీ రిలీజ‌వుతాయ‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు. కానీ అందుకు ఆస్కారం ఉందా? అంటే మేక‌ర్స్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి ఫీల‌ర్స్ లేవు. దీంతో ప‌వ‌న్ అభిమానుల‌కు ఈసారి నిరాశ త‌ప్ప‌దా? అంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

వ‌కీల్ సాబ్ ద‌స‌రా ప్ర‌మోష‌న్స్ పై ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు ఇంకా స్పందించనే లేదు. అలాగే క్రిష్ సైతం ప‌వ‌న్ మూవీ అప్ డేట్ ఏదైనా చెబుతాడా? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది. కంబ్యాక్ లో క్రేజీ సినిమాల్లో న‌టిస్తున్న ప‌వ‌న్ నుంచి చాలా ఎక్కువ విష‌యాల్ని అభిమానులు ఆశిస్తుంటే ఆశాభంగ‌మే ఎదుర‌య్యేట్టు ఉంద‌న్న ఆందోళ‌న చాలా ముందే వ్య‌క్త‌మ‌వుతోంది. ఇటీవలే పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కిక్కిచ్చినా అది ఇలా దించేస్తారా? అన్న ఆందోళ‌న ఫ్యాన్స్ కి ఉంది. ద‌స‌రాకి చాలామంది టీజ‌ర్లు రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ప‌వ‌న్ నుంచి ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌నే ఆశిస్తున్నారు. మునుముందు ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.