పవన్ డైరెక్టర్ కర్చీఫ్ వేస్తున్నాడా?

Thu May 12 2022 16:00:04 GMT+0530 (India Standard Time)

Pawan Director Planning to do a Movie with Mahesh?

సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ ని అలరిస్తూనే క్లాస్ ఆడియన్స్ కోసం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లు చేస్తుంటారు. ఆయన మాస్ అవతారం ఎత్తిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద సెంటిమెంట్ లా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. రెండున్నరేళ్ల క్రితం 'సరిలేరు నీకెవ్వరు' వంటి దేశ భక్తి ప్రధానంగా సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ తరువాత మహేష్ సినిమా థియేటర్లలో సందడి చేసి చాలా కాలమే అవుతోంది. దీంతో ఆయన సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వచ్చేస్తుందా? అని అభిమానలు గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. అదే 'సర్కారు వారి పాట'. యంగ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రారంభం నుంచి మంచయి క్రేజ్ ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఈ చిత్ర ప్రచార చిత్రాలు. ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్.. ఇందులో మహేష్ పలికిన సంభాషణలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. మహేష్ మరోసారి మాస్ ఆవతారంలో కనిపించబోతున్నారనే సంకేతాల్ని అందించాయి. అంతే కాకుండా ఈ సినిమా ట్రైలర్ టీజర్ 'పోకిరి' చిత్రాన్ని గుర్తుచేయడంతో అభిమానులు ఇక థియేటర్లలో జాతరే అనే ఫీలింగ్ ని వ్యక్తం చేసి సెలబ్రేషన్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు.

మహేష్ ని ఫుల్ మాసీవ్ అవతార్ లో చూపించిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ గురువారం థియేటర్లలోకి వచ్చేసింది. తొలి షో నుంచే 'సర్కారు వారి పాట' పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు. రెండున్నరేళ్లుగా ఇలాంటి సినిమా కోసమే ఎదురుచూశామంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీపై సెలబ్రిటీలు స్టార్ డైరెక్టర్లు కూడా ప్రశంసలు కురిపించడం మొదలు పెట్టారు.

అయితే మహేష్ తో ఇంత వరకు ఏ సినిమాకు వర్క్ చేయని స్టార్ డైరెక్టర్ 'సర్కారు వారి పాట'పై సూపర్ స్టార్ మహేష్ పై ప్రశంసల వర్షం కురిపించడం ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా దర్శకుడు పరశురామ్ ని మరీ ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు.

ఓ రకంగా చెప్పాలంటే సినిమాపై మినీ రివ్యూని అందించారు. 'ఇదంతా మహేష్ వల్లే.. మహేష్ ఏం స్వాగ్ ఏమీ టైమింగ్ 'సర్కారు వారి పాట' చూడ్డానికి ట్రీట్ లా వుంది. పరశురామ్ పెట్ల తన రైటింగ్ తో పవర్ ఫుల్ క్యారెక్టర్లని హిలేరియస్ గా ప్రజెంట్ చేశాడు అలాగే నటీనటుల నుంచి అద్భతమైన పెర్ఫార్మెన్స్ ని రాబట్టాడని' ప్రశంసలు కురిపించారు దర్శకుడు హరీష్ శంకర్  

చివర్లో మైత్రీ మూవీ మేకర్స్ కి మరోసారి గాలం వేస్తూ ఈ సంస్థ ఈ సారి దిష్టి తీయించుకోవాలన్నారు. హరీష్ శంకర్ కెరీర్ లో ఇంత వరకు రవితేజ ( షాక్ మిరపకాయ్ ) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (గబ్బర్ సింగ్) అల్లు అర్జున్ (డీజే దువ్వాడ జగన్నాథం) ఎన్టీఆర్ ( రామయ్యా వస్తావయ్యా) సాయి ధరమ్ తేజ్ ( సుబ్రమణ్యం ఫర్ సేల్) వరుణ్ తేజ్ ( గద్దలకొండ గణేష్) లతో సినిమాలు చేశారే కానీ సూపర్ స్టార్ మహేష్ తో ఇంత వరకు సినిమా చేయలేదు. తాజాగా 'సర్కారు వారి పాట' పై ప్రశంసలు కురిపించడంతో హరీష్ శంకర్ .. మహేష్ తో సినిమా కోసం కర్చీఫ్ వేస్తున్నారా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఐత్రీ వారు తలుచుకుంటే అదెంత పని అని కూడా అంటున్నారు. అందుకే హరీష్ శంకర్ చివర్లో ఈ సారి దిష్టి తీయించుకోవాలన్నారని చెబుతున్నారు.