Begin typing your search above and press return to search.

దిమ్మతిరిగేలా పఠాన్​ కలెక్షన్లు.. 5 రోజుల్లో ఎంతంటే?

By:  Tupaki Desk   |   30 Jan 2023 3:01 PM GMT
దిమ్మతిరిగేలా పఠాన్​ కలెక్షన్లు.. 5 రోజుల్లో ఎంతంటే?
X
బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ ఇండియన్​ రా ఏజెంట్​గా నటించిన తాజా చిత్రం 'పఠాన్'. దీపికా పదుకొణె హీరోయిన్. విడుదలకు ముందు విమర్శలతో టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు విడుదల అనంతరం అత్యధిక వసూళ్లను సాధిస్తూ వావ్‌ అనిపిస్తోంది. ఈ చిత్రం తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద రికార్డు వర్షం కురిపిస్తోంది. రోజుకో వంద కోట్లు చెప్పున ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ కలెక్షన్స్​ చూసి అభిమానులు, ఇండస్ట్రీ వారికి మైండ్​ బ్లాంక్ అవుతోంది. ఐదు రోజుల్లో రూ.500కోట్లకు పైగా వసూళ్లను సాధించంది. అలా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే కాకుండా సరికొత్త సెన్షేషన్ రికార్డులను క్రియేట్ చేస్తోంది.

తాజాగా ఐదో రోజు ఈ చిత్రం కేవలం హిందీలో రూ.60 నుంచి 65కోట్లు సాధించినట్లు తెలిసింది. మొత్తంగా ఫస్ట్​ వీకెండ్​ పూర్తయ్యే సరికి గ్లోబల్​ బాక్సాఫీస్​ ముందు 67.84 మిలియన్ డాలర్ల అంటే భారత కరెన్సీలో రూ.555కోట్లు కలెస్ట్​ చేసినట్లు తెలిసింది. కేవలం ఇండియాలో రూ.280కోట్లకు పైగా వసూలు చేసిందట. కేవలం ఐదు రోజుల్లో ఆల్​టైమ్​ టాప్​ 4 గ్రాసింగ్​ ఇండియన్ ఫిల్మ్​గా ​ నిలిచింది.

ఇక యూఏఈలో ఫస్ట్​ వీకెండ్​లో హైయెస్ట్ కలెక్షన్స్​ సాధించిన సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. అవెంజర్స్ ఎండ్​గేమ్​ రూ.5.94మిలియన్ డాలర్స్​తో అగ్రస్థానంలో ఉండగా.. పఠాన్​ 4.80మిలియన్ డాలర్స్​, ఎఫ్​ 8 4.64 మిలియన్ డాలర్స్​ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇకపోతే పఠాన్​.. దేశవ్యాప్తంగా రూ.250 కోట్ల క్లబ్​లోకి కేవలం 5 రోజుల్లోనే ప్రవేశించి రికార్డు సాధించింది. కేజీయఫ్ 2.. ఈ మార్క్​ను చేరుకోవడానికి 7 రోజులు పడితే.. బాహుబలి2 ఎనిమిది రోజులు, దంగల్, టైగర్ జిందా హైకి పది రోజులు పట్టాయి.

స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ మూవీని రూపొందించారు. జాన్‌ అబ్రహం కీలక పాత్ర పోషఇంచారు. ఈ చిత్రంలోని యాక్షన్‌ సీక్వెన్స్‌కు ప్రేక్షకుల స్టన్ అయిపోయారు. విడుదలైన రోజే రూ. 106 కోట్లు సాధించి బాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక 32 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో హౌజ్‌ఫుల్‌ బోర్డు పెట్టడం ఈ సినిమాతోనే సాధ్యమైందని అక్కడి ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌ బృందం తెలిపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.