ఆగని పఠాన్ కలెక్షన్ల జోరు.. 6 రోజుల లెక్క ఇదే!

Tue Jan 31 2023 16:09:06 GMT+0530 (India Standard Time)

Pathan's collection rush.. This is the count of 6 days!

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్'. దీపికా పదుకొణె హీరోయిన్. విడుదలకు ముందు విమర్శలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు విడుదల అనంతరం అత్యధిక వసూళ్లను  సాధిస్తోంది. ఈ చిత్రం తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద రికార్డు వర్షం కురిపిస్తోంది.  రోజుకో వంద కోట్లు చెప్పున ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ కలెక్షన్స్ చూసి అభిమానులు ఇండస్ట్రీ వారికి మైండ్ బ్లాంక్ అవుతోంది. ఐదు రోజుల్లో రూ.500కోట్లకు పైగా వసూళ్లనను సాధించిన ఈ చిత్రం తాజాగా ఆరో రోజు కూడా అదిరిపోయే కలెక్షన్లను అందుకుంది.  ఈ చిత్రం కేవలం ఆరు రోజుల్లో హిందీ వెర్షన్ లో రూ.296 కోట్ల నెట్ సాధించింది. అంటే రూ.300కోట్ల మార్కుకు చేరుకుంది. దీంతో ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సంజయ్ దత్ సంజు రికార్డులను అధిగమించింది.

ఈ మార్క్ కు చేరుకోవడానికి దంగల్ కు 13రోజులు పట్టగా సంజూకు 16రోజుల సమయం పట్టింది. ఇక పోతే ఐదు రోజుల్లో  ప్రపంచవ్యాప్తంగా రూ.555కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఆరో రోజు రూ.600కోట్ల మార్కుకు చేరువగా వచ్చింది. అయితే ఆరో రోజు ఎంత కలెక్ట్ చేసిందో సరిగ్గా స్పష్టత లేదు.

అంతకుముందు దేశవ్యాప్తంగా రూ.250 కోట్ల క్లబ్ లోకి కేవలం 5 రోజుల్లోనే ప్రవేశించి రికార్డు సాధించింది. కేజీయఫ్ 2.. ఈ మార్క్ను చేరుకోవడానికి 7 రోజులు పడితే.. బాహుబలి2 ఎనిమిది రోజులు దంగల్ టైగర్ జిందా హైకి పది రోజులు పట్టాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీని రూపొందించారు.

జాన్ అబ్రహం కీలక పాత్ర పోషఇంచారు. ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ కు ప్రేక్షకుల స్టన్ అయిపోయారు. విడుదలైన రోజే రూ. 106 కోట్లు సాధించి బాలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక 32 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో హౌజ్ఫుల్ బోర్డు పెట్టడం ఈ సినిమాతోనే సాధ్యమైందని అక్కడి ఐనాక్స్ మల్టీప్లెక్స్ బృందం తెలిపింది. ఇక ఈ పఠాన్ చిత్రం ఎన్ని రికార్డ్స్ ను  కొల్లగొడుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.