Begin typing your search above and press return to search.

2023లో నెంబర్ వన్ రికార్డ్.. అసలైన బాద్ షా

By:  Tupaki Desk   |   28 Jan 2023 6:42 PM GMT
2023లో నెంబర్ వన్ రికార్డ్.. అసలైన బాద్ షా
X
షారుక్ ఖాన్ హీరోగా సిద్ధార్ద్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పఠాన్. ఈ సినిమాలో ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యింది. నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మొదటి రోజు నుంచి భారీగానే స్పందన వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ నేపధ్యంలో స్పై కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకి బాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

 ఓ వైపు నెగిటివ్ ప్రచారం నడుస్తున్నా కూడా సినిమా కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. పఠాన్ రిజల్ట్ పట్ల బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. సౌత్ ఆధిపత్యం నుంచి పఠాన్ సినిమా బాలీవుడ్ ని మళ్ళీ పైకి తీసుకెళ్ళి నిలబెట్టిందని గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎవరికి వారు తమ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసారు. దీంతో సినిమాకి మంచి హైప్ క్రియేట్ అవుతుంది.

మొదటి రోజు కంటే రెండో రోజు మూవీ కలెక్షన్స్ మరింత పెరగడం విశేషం. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డుని క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బాలీవుడ్ క్రిటిక్స్ కూడా మూవీకి 4+ రేటింగ్స్ ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఓవర్సీస్ లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ నేపధ్యంలో  మొదటి మూడు రోజుల్లోనే ఏకంగా 112 గ్రాస్ ని ఓవర్సీస్ లో పఠాన్ రాబట్టింది.  ఓవరాల్ గా 313 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.

ఈ ఏడాది ఆరంభంలో రిలీజ్ అయిన సినిమాలలో ఓవర్సీస్ లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన చిత్రాల జాబితాలో పఠాన్ మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత విజయ్ వారిసు మూవీ ఓవర్సీస్ లో 82 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. తరువాత తునివు మూవీ 52 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీని తర్వాత వాల్తేర్ వీరయ్య 28 కోట్ల గ్రాస్, తరువాత వీరసింహారెడ్డి 15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మొత్తానికి ఈ ఏడాది ఆరంభంలో ఓవర్సీస్ లో పఠాన్ మూవీ భారీ కలెక్షన్స్ ని రాబట్టడం ద్వారా మళ్ళీ తమ పూర్వవైభవాన్ని బాలీవుడ్ ఇండస్ట్రీ తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తుంది అనే మాట వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.