మహర్షి సినిమాకు పాశర్లపూడి లింక్?

Fri Apr 19 2019 15:25:36 GMT+0530 (IST)

Pasarlapudi Blowout Episode In Maharshi

ఈ సమ్మర్ సీజన్ లో రిలీజ్ కానున్న సినిమాల్లో 'మహర్షి' మీద ఉన్న అంచానాలు మరే ఇతర సినిమాలపై లేవు.  ఇతర ఎ లీగ్ స్టార్ల సినిమాలేవీ లేకపోవడంతో అందరి దృష్టి మహేష్ సినిమాపై ఉంది.  ఈ సినిమాలో మహేష్ పాత్రకు మూడు వేరియేషన్లు ఉన్నాయని.. ఒక ఎపిసోడ్ లో రైతు సమస్యలపై పోరాడతాడని ఇప్పటికే గుసగుసలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 'మహర్షి' సినిమాలో మరో కీలకమైన ఎపిసోడ్ ఉందట.చరిత్రలో మరుగున పడిపోయిన పాశర్లపూడి బ్లో అవుట్ సంఘటన ఈ సినిమాలో కీలక మలుపుకు కారణం అవుతుందట.  1995 కృష్ణా గోదావరి బేసిన్ కు సంబంధించిన గ్యాస్ పైప్ లైన్  తూర్పు గోదావరి జిల్లాలోని పాశర్లపూడి గ్రామం పేలిపోయి గ్యాస్ లీక్ అయింది.  ఈ గ్యాస్ బ్లో అవుట్ సంఘటన భారతదేశంలోనే అతిపెద్ద బ్లో అవుట్.  ఈ సంఘటనలో ఎవరూ మృతి చెందలేదు కానీ దాదాపుగా పాశర్లపూడి చుట్టుపక్కల ఉన్న 65 గ్రామాలు పొగతోనూ.. బ్లో అవుట్ నుంచి వచ్చే బూడిదతోనూ కప్పుబడ్డాయి.  దాదాపుగా 1500 మందిని తమ ఇళ్ళనుండి ఖాళీ చేయించారు.  'మహర్షి' సినిమాలో ఈ సంఘటన ను చూపిస్తారని.. దీంతోనే కథాగమనంలో మార్పు వస్తుందని అంటున్నారు.  కానీ ఈ ఎపిసోడ్ ను సీక్రెట్ గా ఉంచారట.

ఈ బ్లో అవుట్ ఎపిసోడ్ కోసం విజువల్ ఎఫెక్ట్స్ ను వాడారట.  నిజానికి ఈ సినిమా విడుదల ఏప్రిల్ నుండి మే నెలకు మారడానికి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా ఒక కారణమట.  మరి సినిమా రిలీజ్ అయితే కానీ ఈ బ్లో అవుట్ ఎపిసోడ్ ను సినిమా కథకు బలం చేకూరేలా ఎలా ఉపయోగించారనేది మనకు తెలియదు.  ఏదేమైనా ఇలాంటి హిస్టారికల్ ఎపిసోడ్స్ టచ్ చేయాలంటే మాత్రం మేకర్స్ కు నిజంగానే గట్స్ ఉండాలి.