ఆ నాయకుడు తో పెళ్లి మాట ఎత్తితే అమ్మడి సిగ్గు మామూలుగా లేదు!

Wed Mar 29 2023 21:23:30 GMT+0530 (India Standard Time)

Parineeti's reaction to marrying an AAP leader?

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు రాఘవ్ చద్దాతో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా ప్రేమలో ఉందని ఇటీవల కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరూ జంటగా ఉన్న ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో విరివిగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఈ జంట పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ కథనాలొచ్చాయి. అయితే ఇవన్నీ నిజమేనా?  కేవలం ఊహాగానాలు మాత్రమేనా? అంటూ పారీ వెంటపడితే ఏమని సమాధానమిచ్చిందో తెలుసా?పెళ్లి పుకార్లు నిజమేనా అని పలువురు ఫోటోగ్రాఫర్లు పరిణీతిని వెంబడించి మరీ అడిగారు. దీనికి పరిణీతి మొదట నవ్వి ఆ తర్వాత తన కారు దగ్గరకు వెళుతున్నప్పుడు కొంత సిగ్గులు ఒలకబోసింది. సమాధానం చెప్పాలని ఫోటోగ్రాఫర్లు పట్టుబట్టడంతో పారీ తనదైన స్టైల్లో నవ్వేసింది. ''హ్మ్?'' అంటూ తన కారులో అడుగు పెట్టడానికి ముందు చిరునవ్వుతో ఒక అందమైన బౌన్సర్ విసిరింది. ప్లీజ్ అదేంటో కన్ఫామ్ చేయొచ్చు కదా! అని ఫోటోగ్రాఫర్లు మళ్లీ మళ్లీ వెంటపడ్డారు. ఇంతలోనే ''ధన్యవాదాలు...'' చెప్పింది. దీంతో ''బై బై... గుడ్ నైట్'' అంటూ ఫోటోగ్రాఫర్లు ఆమెను ఆటపట్టించడంతో  పరిణీతి సిగ్గుపడుతూ మళ్లీ నవ్వింది. పరిణీతి నలుపు రంగు బ్లేజర్  మ్యాచింగ్ ప్యాంటులో అద్భుతంగా కనిపించింది.

AAP నాయకుడితో పెళ్లి పుకార్లపై పరిణీతి చోప్రా స్పందిస్తూ కాసేపు సిగ్గులొలికించింది కానీ సమాధానమివ్వలేదు. ఇటీవల పరిణీతి ముంబైలో రాఘవ్ చద్దాతో కలిసి కనిపించింది.  ఈ జంట  గత వారం ఒక రెస్టారెంట్ వెలుపల కనిపించారు. మరుసటి రోజు కూడా జంటగా కనిపించారు. బ్లాక్ జీన్స్ తో క్యాజువల్ బ్లాక్ టీస్ వేసుకున్న పరిణీతి ఆ సమయంలో చిరునవ్వుతో ఫోటోగ్రాఫర్లను పలకరించింది. వీరిద్దరు కలిసి కనిపించడం వల్ల ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారనే పుకార్లు వైరల్ అయ్యాయి. ఈ జంట ఫోటోలపై స్పందిస్తూ.. ఒక వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో- వారు డేటింగ్ చేస్తున్నారా? వారు కలిసి మంచిగా కనిపిస్తారు! అని వ్యాఖ్యానించారు. నిజానికి పరిణీతి - రాఘవ్ ఇరువురూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కలిసి చదువుకున్నారు. చాలా కాలంగా స్నేహితులు అన్న విషయం కొందరికే తెలుసు.

మంగళవారం ఆప్ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరా 'రాఘవ్ - పరిణీతి చోప్రా' జంటను అభినందించారు. వారి కలయిక ప్రేమ ఆనందం సాంగత్యంతో సమృద్ధిగా ఆశీర్వదించబడుతుందని అన్నారు. ఆ ఇరువురికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాఘవ్- పరిణీతి ఇద్దరినీ ట్యాగ్ చేస్తూ సంజీవ్ ట్వీట్ చేశాడు. తన ట్వీట్ తో పాటు ఆప్ ఎంపీ రాఘవ్ -పరిణీతి విడివిడిగా ఉన్న ఫోటోలను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఇటీవల పార్లమెంటు వెలుపల డేటింగ్ పుకార్ల గురించి రాఘవ్ ని ప్రశ్నించగా.. మీరు నన్ను రాజకీయాల గురించి ప్రశ్నించండి.. పరిణీతి గురించి కాదు! అని బదులిచ్చారు. జవాబ్ దేంగే (నేను సమాధానం ఇస్తాను).. అని అన్నాడు. తన గురించి పరిణీతి గురించి పుకార్లపై తన స్పందన ఏమిటి? అంటూ రెట్టించి ప్రశ్నించగా.. అతను చిరునవ్వుతో సరిపెట్టేశాడు కానీ సమాధానమివ్వలేదు.

పారి కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇంతియాజ్ అలీ తెరకెక్కిస్తున్న 'చమ్కిలా'లో దిల్జిత్ దోసాంజ్ సరసన పరిణీతి నటిస్తోంది. ఈ చిత్రం ఇద్దరు ప్రముఖ పంజాబీ గాయకులు అమర్ జోత్ కౌర్ -అమర్ సింగ్ చమ్కిలా చుట్టూ తిరుగుతుంది. అమర్ జోత్ పాత్రలో పరిణీతి నటిస్తుండగా  చమ్కిలా పాత్రలో దిల్జీత్ కనిపించనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.