ఫిగర్ ఉండి.. అవకాశాలు లేని శుద్ధ్ దేశి భామ!!

Sat Jul 11 2020 21:00:21 GMT+0530 (IST)

Shuddh desi heroine without opportunities !!

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా. ఇండస్ట్రీలోకి ప్రియాంక చోప్రా చెల్లెలిగా అరంగేట్రం చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుండి పట్టా పొందిన పరిణితి.. చదువు అయిపోగానే యశ్ రాజ్ ఫిలిమ్స్ లో పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంటుగా పనిచేసింది. ఇక 2011లో అదే సంస్థ నిర్మించిన 'లేడీస్ వర్సెస్ రికీ బౌల్' సినిమాతో హీరోయిన్ అయింది. మొదటి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు అందుకుంది ఈ భామ. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో తనను తను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇక 2012లో ఇషాక్ జాదే.. 2013లో శుద్ధ్ దేశి రొమాన్స్.. 2014లో హసీ తో ఫసీ.. ఇలా వరుస విజయాలతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. ఇషాక్ జాదే శుద్ధ్ దేశి రొమాన్స్ మూవీస్ లో పరిణితి రొమాన్స్ యువతకు కిక్కిచ్చిందని చెప్పాలి. నిజంగానే ముద్దులతో బెడ్ సీన్స్ తో రెచ్చిపోయింది. పరిణితి అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు.కానీ ఎంత గ్లామర్ షో చేసినా ఈ పరిణితి మాత్రం స్టార్ హీరోయిన్ అనే మార్క్ అందుకోలేక పోయింది. కానీ నటిగా మాత్రం ఓ మంచి పేరు తెచ్చుకుంది. బొద్దుగా ఉండటం వలన వరుస హిట్ల తర్వాత అమ్మడికి అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఎందుకంటే బొద్దుగా కాదు లావుగా తయారయింది. బాలీవుడ్‌లో శరీరాకృతి నాజూగ్గా ఉంటేనే అవకాశాలు దక్కుతాయి. ఇక ఆ తర్వాత కష్టపడి వర్కౌట్స్ చేసి నాజూకుగా తయారయ్యింది అమ్మడు. పరిణితి సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్. తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటో చూస్తూ అభిమానులు మనసు పారేసుకుంటున్నారు. ఎందుకంటే.. ఆ ఫోటోలో అమ్మడు రెడ్ కలర్ స్విమ్ సూట్ ధరించి ఓ రొమాంటిక్ లుక్ ఇచ్చింది. ఇక థైస్ అయితే కుర్రాళ్ళలో కుంపటి రేపడం పక్కా. అలాంటి పోజిస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ఇట్టే లైక్ షేర్ కామెంట్స్ అంటున్నారు. ఇంత ఫిగర్ ఉంది.. అవకాశాలు నిల్లు. ప్రస్తుతం భామ పిక్ తెగ వైరల్ అవుతోంది.